కేసీఆర్ ఆనవాలు చెరిపివేయడం మీ తరం కాదు
కేసీఆర్ గారి ఆనవాలు తెలంగాణలో చెరిపి వేయడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్వీటర్ వేదిగా సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ వేశారు

- తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ : కేసీఆర్ గారి ఆనవాలు తెలంగాణలో చెరిపి వేయడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ట్వీటర్ వేదిగా సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ వేశారు. కేసీఆర్ ఆనవాలు డాక్టర్ బీఆర్ అంబేదర్కర్ సెక్రటేరియట్ రూపంలో మీరు రిలీజ్ చేసిన ప్రభుత్వ క్యాలెండర్లో మీ వెనుకాలనే ఠీవి గా ఉందంటూ ఫోటోను జత చేశారు.

తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలని, తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా కేసీఆర్ అనే లెజెండ్ యొక్క ఆనవాలు మీ కంటే ముందే ఉంటుందన్నారు. కాంగ్రెస్ చెరిపి వేయాలనుకున్న ఆనవాలు భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, సర్దార్ పటేల్, అంబేడ్కర్, పీవీ మొదలగు వారి ఆనవాలు ఇన్నేళ్లయినా చేరిపేయలేక పోయారన్నారు. అదేవిధంగా కేసీఆర్ ఆనవాలు తెలంగాణలో చెరిపి వేయడం మీ తరం కాదంటూ ట్వీట్లో పేర్కోన్నారు.