అప్పుడు నితిన్.. ఇప్పుడు విశాల్ బలయ్యారు

విధాత: సినిమా వారు అందరి వారు. అందరి అభిమానాన్ని చూర‌గొంటేనే పది కాలాలపాటు నిలబడి ఉంటారు. సినిమాలు పూర్తిగా వద్దనుకున్న తర్వాత రాజకీయాలపై దృష్టి పెడితే ఓకే గానీ.. సినిమాల్లో ఎదుగుతున్నప్పుడే రాజకీయాలపై దృష్టి పెట్టి ఏవేవో మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వారి సినిమాలపై పడుతుంది. ఇక విషయానికొస్తే కొంతకాలం క్రితం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో నితిన్ అలియాస్ నితిన్ రెడ్డి హీరో కాగా దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి ఈ […]

  • By: krs    latest    Dec 25, 2022 7:00 AM IST
అప్పుడు నితిన్.. ఇప్పుడు విశాల్ బలయ్యారు

విధాత: సినిమా వారు అందరి వారు. అందరి అభిమానాన్ని చూర‌గొంటేనే పది కాలాలపాటు నిలబడి ఉంటారు. సినిమాలు పూర్తిగా వద్దనుకున్న తర్వాత రాజకీయాలపై దృష్టి పెడితే ఓకే గానీ.. సినిమాల్లో ఎదుగుతున్నప్పుడే రాజకీయాలపై దృష్టి పెట్టి ఏవేవో మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వారి సినిమాలపై పడుతుంది. ఇక విషయానికొస్తే కొంతకాలం క్రితం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో నితిన్ అలియాస్ నితిన్ రెడ్డి హీరో కాగా దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమా దర్శకుడు.

రాజశేఖర్ రెడ్డి శేఖర్‌గా పరిచితుడు. ఎడిటర్‌గా పలు సినిమాలకు పని చేసిన శేఖర్ మాచర్ల నియోజక వర్గంతో దర్శకుడు అయ్యాడు. అతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. గతంలో అతడు వైసీపీ ప్ర‌త్య‌ర్థి పార్టీల మీద చేసిన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ సమయంలో హైలైట్ అయ్యి దర్శకుడిగా అతని తొలి సినిమా మీద విపరీతమైన నెగటివ్ ప్రచారానికి కారణమైంది.

ఏపీలో ప్రస్తుతం జగన్ సర్కార్ మీద వ్యతిరేకత పెరుగుతోన్న త‌రుణంలో శేఖర్ చేసిన పాత కామెంట్స్‌పై దుమారం రేగి సినిమాపై ఎఫెక్ట్స్ పడేలా చేసింది. ఆయన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన కార్యకర్తలకు. ఆయా పార్టీల మద్దతుదారులకు అసలు నచ్చలేదు. దాంతో ఆ ప్రభావం మాచర్ల నియోజకవర్గం‌పై పడింది.

నిజానికి నితిన్ పవన్‌కు వీరాభిమాని. కానీ జనసేన అభిమానులు మాత్రం నితిన్ని కూడా పక్కనపెట్టి ఆయన చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన శేఖర్‌కు భారీ ఫ్లాప్‌ని ఇచ్చారు. నితిన్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయ‌న వివాదాలకు దూరం. అయినా ఈ చిత్రానికి నితిన్ గత చిత్రాలతో పోలిస్తే కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తుస్సుమనిపించింది. ఈ సినిమా సమయంలో నితిన్ కూడా బాగా నెగెటివిటీని ఎదుర్కొన్నాడు.

ప్ర‌స్తుతం అదే త‌ర‌హా సీన్ విశాల్ నటించిన ‘లాఠీ’ చిత్రం‌పై పడింది. ఈ చిత్ర దర్శకుడి గురించి పెద్దగా తెలియకపోయినా.. విశాల్ అలియాస్ విశాల్ రెడ్డి ‘లాఠీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జగన్‌కు అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేశాడు. ఐ లవ్ జగన్. నాకు ఇప్పుడున్న ముఖ్య‌మంత్రుల‌లో అంద‌రి కంటే జగన్ అంటే ఇష్టం అని చెప్పాడు. ఇది ఈసారి టీడీపీ, జనసేన వర్గాలను కూడా తీవ్రంగా హర్ట్ చేసి ఆ ప్రభావం ‘లాఠీ’ చిత్రంపై పడేలా చేసింది.

విశాల్ కూడా రెడ్డి కావడంతో అతనిపై కూడా తీవ్ర నెగిటివిటీ జోరందుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల కాకముందే బాగా నెగిటివ్ ప్రచారం జరిగింది. జనాల మూడ్ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఆ వ్య‌తిరేక‌త ప్ర‌భావం ఈ సినిమాపై పడింది. విశాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తేలిపోయింది. దీనిపై పెట్టిన పెట్టుబడి మూడు కోట్లలో కనీసం సగమైన వెనక్కి వచ్చేలా కనిపించడం లేదనేలా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుండటం విశేషం.