హోరాహోరీగా సాగిన నామినేషన్స్.. ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ కానుంది ఎవరో.!

బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో నామినేషన్స్ చాలా వాడివేడిగా సాగాయి. సోమవారం మొదలైన నామినేషన్ ప్రక్రియ మంగళవారం వరకు కొనసాగింది.ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు సమానమే అని చెప్పిన బిగ్ బాస్ ప్రతి ఒక్కరు తగిన కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని చెబుతూ, వారి ఎదురుగా ఉన్న కుండని పగలగొట్టాలని ఆదేశించాడు.
పల్లవి ప్రశాంత్‌తో నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా, ఆయన తగు కారణాలు చెప్పిసందీప్, టేస్టీ తేజాలను నామినేట్ చేశాడు. అమర్ దీప్.. పూజా మూర్తి, అర్జున్, ప్రియాంక కూడా వారినే నామినేట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
తనని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం పట్ల అశ్విని ఒకింత ఆవేదనకి గురైంది. ఇక భోలే షావలి మాత్రం కూల్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ నామినేషన్స్ కోసమే నన్ను వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్లో తెచ్చారనుకుంటా అని చెప్పుకొచ్చాడు. ఇక నామినేషన్స్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్- సందీప్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వు నన్ను ఊరోడు అని అన్నావని ప్రశాంత్ , తాను అలా అనలేదంటూ తన డ్యాన్స్ మీద ప్రమాణం చేశాడు.
మంగళవారం నామినేషన్స్ లో శోభా.. తన మిత్రుడు తేజని నామినేట్ చేసింది. రూల్స్ పాటించకుండా పొగరుగా వ్యవహస్తున్నాడని చెప్పుకొచ్చింది. అనంతరం భోలేను నామినేట్ చేస్తూ.. అతను బూతులు మాట్లాడుతున్నాడు. అతని ప్రవర్తన సరిగా లేదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మధ్యలో దూరిన ప్రియాంక.. ఆడవాళ్లంటూ రెస్పెక్ట్ ఉన్నట్టు నటిస్తున్నాడని చెబుతూ, థూ అని ఊచింది. అదే నేను చేస్తే నీ బ్రతుకు ఏం కావాలని భోలే అన్నాడు.
ఇక భోలే… ప్రియాంక, శోభా శెట్టిలను నామినేట్ చేయగా ఆ సమయంలో భోలే కాస్త వింతగా ప్రవర్తించాడు. అప్పుడు ప్రియాంక కూడా అంతే వెకిలిగా ప్రవర్తించింది. మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో అమర్ దీప్, గౌతమ్, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు..నామినేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత భోలే… ప్రియాంక, శోభా దగ్గరకు వెళ్లి వారితో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేశాడు. కాని వాళ్లిద్దరు భోలేని వెళ్లిపోవాలంటూ సీరియస్ అయ్యారు.
ఇక శోభా శెట్టి.. తనని నామినేట్ చేయడంతో తేజ తెగ ఫీలయ్యాడు. హౌజ్‌లో మిగతావారు నామినేట్ చేసిన ఇంత బాధపడే వాడిని కాదు, నువ్వు నన్ను నామినేయడం బాధగా ఉందని శోభతో అన్నాడు తేజ. దానికి శోభ.. స్నేహం స్నేహమే నామినేషన్ నామినేషనే అంటూ కవర్ చేసింది.