ఇద్దరు యువకులను చితక్కొట్టిన నర్సు.. వీడియో వైరల్
విధాత: ఓ నర్సు ఇద్దరు యువకులను చితక్కొట్టింది. కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మరో నర్సు పక్కనే ఉండి ఆమెకు సహకరించింది. ఈ ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికెట్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వమని ఆస్పత్రి సిబ్బంది చెప్పింది. దీంతో ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను ఆ ఇద్దరు యువకులు తమ కెమెరాల్లో బంధించారు. అయితే […]

విధాత: ఓ నర్సు ఇద్దరు యువకులను చితక్కొట్టింది. కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మరో నర్సు పక్కనే ఉండి ఆమెకు సహకరించింది. ఈ ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికెట్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వమని ఆస్పత్రి సిబ్బంది చెప్పింది. దీంతో ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను ఆ ఇద్దరు యువకులు తమ కెమెరాల్లో బంధించారు. అయితే యువకులు వీడియో తీయడాన్ని నర్సులు గమనించారు.
ఇంకేముంది.. ఆ ఇద్దర్నీ మరో ఇద్దరు నర్సులు ఓ గదిలో బంధించారు. ఇక ఒక నర్సు.. కర్రతో వారిని వాయించింది. వీపులపై ఇష్టమొచ్చినట్లు కొట్టింది. వీడియోలను డిలీట్ చేయాలని ఆదేశించింది. ఇంకో నర్సు చూస్తూ ఉండిపోయింది. యువకులను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నర్సులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులకు నెటిజన్లు ట్యాగ్ చేస్తున్నారు. నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరేమో.. ఆ యువకులు నర్సుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొంటున్నారు.