thieves steal oil goods train | కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లుగా తయారైంది బిహార్‌లో పరిస్థితి. ఇప్పటి ఇనుముతో నిర్మించిన వంతెనలతో పాటు టవర్లు దొంగలు మాయం చేశారు. చివరకు రైలింజన్‌ను సైతం లూటీ చేశారు. తాజాగా రైలులో ట్యాంకర్లలో వెళ్తున్న ఇంధనాన్ని సైతం కాజేస్తున్నారు. బిహార్‌లోని బిహ్తా గుండా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకొని అందులో ఇంధనాన్ని ఖాళీ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఆగిన ట్రైన్ నుంచి కాకుండా.. వంతెనపై రన్నింగ్ ట్రెయిన్ నుంచి ఆయిల్‌ను దొంగతనం చేయడం విశేషం. బకెట్లు పట్టుకొని రైలు వెంట ఇంధనం కోసం పరుగులుపెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గూడ్స్ రైలు ఇంధనంతో హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఆయిల్ డిపోకు వెళ్తుండగా.. గమ్యస్థానానికి చేరుకునేలోపే ఖాళీ చేస్తున్నారు.
ఈ దుశ్చర్యపై సోషల్ మీడియాలో యూజర్లు పలు రకాలుగా స్పందించారు. ‘ఇది సిగ్గుమాలిన చర్య అని.. అధికారులు ఎక్కడా?’ అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ‘ఏం చెప్పాలి.. ఎవరిని నిందించాలి.. మాటలు లేవు’ అంటూ మరో యూజర్ స్పందించాడు. ఉచితాలు లేదంటే దొంగతనం అలవాటు చేసుకున్న వ్యక్తులు సాధించడానికి ప్రేరణ పొందలేరు. మీకు అభివృద్ధి ఎందుకు అవసరం’ అని మరో యూజర్ ప్రశ్నించాడు.
ఇదిలా ఉండగా.. ఇటీవల బంకా జిల్లాలో రెండు కిలోమీటర్ల రహదారిని దొంగలు మాయం చేశారు. ఖదంపూర్ – ఖరౌనీ అనే రెండు గ్రామాలను కలిపే రోడ్డును మాయం కాగా.. దాని స్థానంలో గోధుమ పంట కనిపించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. అంతకు ముందు బెగుసరాయ్‌లో డీజిల్ ఇంజిన్‌ను మాయం చేసేందుకు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్‌లో అమియావర్ గ్రామంలో 45 సంవత్సరాల కిందట నిర్మించిన వంతెనను దొంగలు మాయం చేశారు. ఆ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.