ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా..! ఈ ఆఫర్ మీ కోసమే..!

దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కంపెనీ ఓలా కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బంపర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది

  • Publish Date - January 27, 2024 / 04:37 AM IST

Ola Discount Offers | దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కంపెనీ ఓలా కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బంపర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో స్కూటర్‌పై రూ.25వేల వరకు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ జనవరి 31 వరకు అందుబాటులో ఉండనున్నది. ఈ ఆఫర్‌ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్ అంతటికీ వర్తించనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ రిపబ్లిక్ డే ఆఫర్‌ర్‌లో పొడిగించిన వారంటీపై 50 శాతం తగ్గింపు, ఎస్‌1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో మోడల్‌పై రూ.2వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇవ్వనున్నది.


దాంతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్‌కార్డు ఈఎంఐలపై రూ.5వేల వరకు తగ్గింపు, జీరో డౌన్‌పేమెంట్‌, జీరో ప్రాసెసింగ్‌ ఫీజు, 7.99శాతం నుంచి వడ్డీ రేట్లు, ఫైనాన్స్‌ తదితర ఆఫర్స్‌ను ఓలా అందిస్తున్నది. దాంతో పాటు ఓలా ఎస్‌1ఎక్స్‌ ప్లస్‌ గతేడాది డిసెంబర్‌లో తొలిసారిగా ప్రకటించిన రూ.20వేలు తగ్గింపును సైతం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 89,999 (ఎక్స్-షోరూమ్)కే లభించనున్నది. ఓలా ఎలక్ట్రిక్ శ్రేణి వివిధ ధరల పాయింట్లలో ఐదు మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్‌1ఎక్స్‌ (S1 X 2 kWh), ఎస్‌1ఎక్స్‌ (S1 X 3 kWh), ఎస్‌1ఎక్స్‌ ప్లస్‌ (S1 X+) ఎస్‌1 ఎయిర్‌, ఎయిర్‌ ఎస్‌1 ఉన్నాయి.


ఎంట్రీ-లెవల్ ఎస్‌1 ఎక్స్‌ విక్రయాలు ఇంకా షురూ కాలేదు. వాటిని రూ.999 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకునేందుకు వీలుంది. ఓలా ఈ-స్కూటర్ లైనప్ ధర రూ 89,999 నుంచి రూ. 1.47 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండనున్నది. ఓలా ఎలక్ట్రిక్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో కస్టమర్లు దేశంలోని 26 నగరాల్లోని తమ సమీప ప్రముఖ వారసత్వ ప్రదేశాలకు వెళ్లినట్లు పేర్కొంది. మరో వైపు త్వరలో ఓలా ఐపీఓకు రాబోతున్నది. ఇందుకు సంబంధించిన కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను సైతం దాఖలు చేసింది.