Nalgonda: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

విధాత: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన పాతూరు జగదీష్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ కు వెళ్తున్న జగదీష్ వెలిమినేడు గ్రామ శివారు వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టు లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్‌ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. సంఘటనపై మృతుడి […]

Nalgonda: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

విధాత: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన పాతూరు జగదీష్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ కు వెళ్తున్న జగదీష్ వెలిమినేడు గ్రామ శివారు వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టు లోకి దూసుకెళ్లింది.

ప్రమాదంలో అతడి తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది జగదీష్‌ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. సంఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.