Palakollu Jahnavi| అంతరిక్ష యాత్రకు పాలకొల్లు జాహ్నవి

Palakollu Jahnavi| అంతరిక్ష యాత్రకు పాలకొల్లు జాహ్నవి

విధాత : ఓ తెలుగు యువతి అంతరిక్ష యాత్రకు సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్ పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్ష యాత్రకు వెళ్లనుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా జాహ్నవి రోదసిలోకి అడుగుపెట్టనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్‌ నుంచి జాహ్నవి పాల్గొననుంది. ఈ యాత్రలో భాగంగా ఆమె ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతోపాటు పలుదేశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. ఈ మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు, అతి చిన్న వయస్కురాలుగా జహ్నవి రికార్డు సాధించబోతుంది. పాలకొల్లులో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తిన జాహ్నవి పంజాబ్ లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు. ఆమె అమ్మ, నాన్న పద్మశ్రీ, శ్రీనివాస్ లు కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

22 ఏళ్ల వయసులోనే అనలాగ్ వ్యోమగామిహ గుర్తింపు సాధించింది. అతి చిన్న వయసులోనే సెస్నా 171 స్కైహక్ రాకెట్ ను విజయవంతంగా నడిపింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్, వంటి అంశాల్లో జాహ్నవి శిక్షణ పొందింది. గతంలో 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ రంగాల్లో కూడా జాహ్నవి గుర్తింపు పొందింది. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన చందమామ కథలు..చంద్రుడు..పేదరాసి పెద్దమ్మ కథల విని చంద్రుడిపై ఆసక్తి పెంచుకుని ఎప్పటికైనా చంద్రుడి మీదకు వెళ్లాలనుకునేదాన్నని..ఆ కోరిక చివరకు నన్న వ్యోమగామి రోదసీ బాట పట్టించిందని జాహ్నవి చెబుతుంది.