మాట తప్పని పవన్.. ఇప్పటం గ్రామస్తులకు ఆర్థిక సాయం

విధాత‌: ఎవరేమనుకున్నా.. కోర్టుల కామెంట్లు ఏమైనా గానీ ఇప్పటం గ్రామస్తులకు తాను ఇస్తానన్నరూ. లక్ష ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ ఆదివారం అందజేసి మాట నిల‌బెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తుల ఇళ్లను కూల్చివేసిందని జనసేన ఆరోపిస్తున్న‌ది. కాదు కాదు రోడ్ల విస్తరణకు ప్రణాళిక రూపొందించాం, ఈమేరకు గతంలోనే వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటంలో […]

  • By: krs    latest    Nov 27, 2022 4:44 PM IST
మాట తప్పని పవన్.. ఇప్పటం గ్రామస్తులకు ఆర్థిక సాయం

విధాత‌: ఎవరేమనుకున్నా.. కోర్టుల కామెంట్లు ఏమైనా గానీ ఇప్పటం గ్రామస్తులకు తాను ఇస్తానన్నరూ. లక్ష ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ ఆదివారం అందజేసి మాట నిల‌బెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కారణంతో వైసీపీ ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తుల ఇళ్లను కూల్చివేసిందని జనసేన ఆరోపిస్తున్న‌ది.

కాదు కాదు రోడ్ల విస్తరణకు ప్రణాళిక రూపొందించాం, ఈమేరకు గతంలోనే వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటంలో పర్యటించిన పవన్ గతంలోనే గ్రామానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

అయితే ఆ ఇళ్లను కూల్చినపుడు తమకు సమాచారం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు కోర్టుకు వెళ్లారు. అయితే తాము ఇదివరకే నోటీసులు ఇచ్చామని అయినా అందలేదని గ్రామస్తులు చెబుతున్నారని సర్కార్ కోర్టులో వాదించింది. దీన్ని ఫిర్యాదిదారుల తరఫు న్యాయవాది నోటీసులు ఇచ్చార‌ని అంగీకరించారు.

దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటం గ్రామానికి చెందిన 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. ఇలాంటి తరుణంలో పవన్ సదరు గ్రామస్తులకు సహాయం చేస్తారా.. చేయరా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆదివారం పవన్ వారికి ఆర్థికసాయం చేసి తన మాటను నిలబెట్టుకున్నారు.