Pawan Kalyan: ఇక్రిశాట్ స్కూల్ లో పవన్ కల్యాణ్ చిన్న కొడుకు అడ్మిషన్!

విధాత, హైదరాబాద్ :ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్ పటాన్చెరు ఇక్రిశాట్ ను సందర్శించారు. ఇక్రిశాట్ పరిధిలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో కుమారుడు మార్క్ శంకర్ ను చేర్పించేందుకు పవన్ ఇక్రిశాట్ కు వచ్చారని సమాచారం. ఇటీవల సింగపూర్లో అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్శంకర్ ను ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ చేర్పించనున్నట్లుగా తెలిసింది. అన్నా లెజినోవా, పవన్ కల్యాణ్ ల కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో సమ్మర్ కోర్సు చదువుతున్న క్రమంలో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.
ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు స్వల్పంగా గాయలయ్యాయి. పొగ పీల్చడంతో శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యాడు. ఈ సంఘటన తర్వాత మార్క్ శంకర్ ను ఇండియాకు తీసుకవచ్చి వైద్య చికిత్సలు అందించారు. మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్నాడు. మార్క్ శంకర్ ను ఇండియాలోనే స్కూల్ లో చేర్పించాలని భావించిన పవన్ కల్యాణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో అతడికి అడ్మిషన్ తీసుకున్నారని సమాచారం. ఈ స్కూల్ ఫీజు ఏడాదికి రూ.16 లక్షలుగా ఉండవచ్చని సోషల్ మీడియా కథనం.