గాంధీభవన్‌కు వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్‌, డీకేలు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయలు దేరారు.

గాంధీభవన్‌కు వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్‌, డీకేలు

విధాత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు బయలు దేరారు. గాంధీభవన్‌కు చేరుకున్నాక రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ విజయంపై మీడియాతో మాట్లాడనున్నారు. రేవంత్ నివాసానికి డీజీపీకి చేరుకుని ఆయన బందోబస్తును పర్యవేక్షించారు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సీట్లు గెలువడంతో ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రేవంత్ నివాసానికి చేరుకున్నారు. అటు నుంచి గాంధీభవన్‌కు వెలుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం, తెలంగాణ కాంగ్రెస్ పరిశీలకుడు డికే శివకుమార్ కూడా గాంధీభవన్‌కు చేరుకున్నారు.