10th Hindi Paper Leak: బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

విచారణకు సహకరించడం లేదని వాదన ఫోన్ ఇవ్వడం లేదని పేర్కొన్న పోలీసులు కేసు పై మరోసారి నెలకొన్న ఆసక్తి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు సోమవారం పిటిషన్ వేశారు. సంజయ్ బెయిల్ రద్దు చేయాలని స్పెషల్ పీపీ సత్యనారాయణ హనుమకొండ కోర్టులో వేసిన పిటిషన్‌లో కోరారు. విచారణకు సహకరించడం లేదు […]

  • Publish Date - April 17, 2023 / 12:01 PM IST
  • విచారణకు సహకరించడం లేదని వాదన
  • ఫోన్ ఇవ్వడం లేదని పేర్కొన్న పోలీసులు
  • కేసు పై మరోసారి నెలకొన్న ఆసక్తి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు సోమవారం పిటిషన్ వేశారు. సంజయ్ బెయిల్ రద్దు చేయాలని స్పెషల్ పీపీ సత్యనారాయణ హనుమకొండ కోర్టులో వేసిన పిటిషన్‌లో కోరారు.

విచారణకు సహకరించడం లేదు

పోలీసు విచారణకు బండి సంజయ్ సహకరించడం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. సంజయ్ తన ఫోను ఇవ్వాలని పంపిన నోటీసులకు సమాధానం లేదని వివరించారు. దీనిపై సంజయ్ కుమార్ తరపు న్యాయవాదులు స్పందించి తమ క్లైంటుకు నోటీసులు అందలేదని చెప్పారు. నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. ఇదే లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టగా కోర్టు రేపటికి వాయిదా వేసింది.

కేసు పై సర్వత్ర ఆసక్తి

షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైన బండి సంజయ్ విషయంలో పోలీసులు కోర్టును ఆశ్రయించడం చర్చకు దారి తీసింది. ఈ కేసులో మరేమైన ట్విస్ట్ నెలకొంటుందా? అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.

పూర్వపరాలిలా ఉన్నాయి

టెన్త్ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కమలాపురం ఉన్నత పాఠశాల నుంచి పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకైన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నిందితుడిగా బండి సంజయ్ కుమార్‌ను పేర్కొంటూ వరంగల్ పోలీసులు అరెస్టు చేసి హనుమకొండ కోర్టులో హాజరు పరిచారు. కేసును పరిశీలించిన మెజిస్ట్రేట్ బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కరీంనగర్ సెంట్రల్ జైలుకు పంపించారు.

ఈ విషయంలో బండి సంజయ్ తరుపు న్యాయవాదులు హనుమకొండ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారణ జరిగిన అనంతరం జైలుకు వెళ్లిన తెల్లవారే సంజయ్ బెయిల్ పై విడుదలయ్యారు. సంజయ్‌కి షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. శనివారం హనుమకొండలో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో ఆయన పాల్గొన్నారు.

బండి, సిపి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌ని కోర్టులో హాజరు పరిచిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సంజయ్ సూత్రధారిగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఆయన ఫోన్ మాకు లభించలేదని, ఆ ఫోన్ దొరికితే ఇంకా చాలా వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

సిపి పై బండి ఫైర్

బెయిల్ పై సంజయ్ విడుదలైన అనంతరం హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ సీపీపై పలు ఆరోపణలు చేశారు. సిపి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆయన ప్రమాణం చేయాలని, తన ఫోన్ తన వద్ద లేదంటూ వివరించారు. తన ఫోన్ పోయిందంటూ కరీంనగర్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

స్పందించిన పోలీస్ కమిషనర్

బండి సంజయ్ సిపిపై చేసిన ఆరోపణలకు సిపి రంగనాథ్ కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సెటిల్మెంట్లు చేయలేదంటూ స్పష్టం చేశారు. గతంలో చేయని ఆరోపణలు కేసు అనంతరం చేయడం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదంటూ వివరించారు.

ఈ నేపథ్యంలో తాజాగా సంజయ్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో వేసిన పిటిషన్ పై మెజిస్ట్రేట్ ఏ విధమైన తీర్పు ఇస్తారని ఆసక్తి నెలకొంది.