టికెట్ రేసులో పిల్లి స్పీడ్! ఎన్నికల పోరుకు కాన్వాయ్ రెడీ!

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు టికెట్ రేసులో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికే ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారు. ఆపదలో ఉన్న వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు, శుభకార్యాలకు ఆర్థిక సహాయాలు అందిస్తూ ప్రజాదరణ దిశగా ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. అనుచర వర్గంతో పాటు రానున్న ఎన్నికల్లో పోటీకి అవసరమైన […]

  • Publish Date - February 11, 2023 / 07:07 AM IST

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు టికెట్ రేసులో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికే ఆర్కేఎస్ ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారు. ఆపదలో ఉన్న వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు, శుభకార్యాలకు ఆర్థిక సహాయాలు అందిస్తూ ప్రజాదరణ దిశగా ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు.

అనుచర వర్గంతో పాటు రానున్న ఎన్నికల్లో పోటీకి అవసరమైన వాహనాలను కూడా ఆయన ముందస్తుగా సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మరో కొత్త ఫార్చునర్ కారును కొనుగోలు చేసి తన కాన్వాయ్ లో చేర్చుకోవడం విశేషం.

పార్టీ టికెట్ సాధనకు, ఎన్నికల్లో పోటీకి అవసరమైన అన్ని వనరులను సమీకరించుకుంటు సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, పార్టీలోని ఇతర ఆశావహులకు ధీటుగా ఎక్కడా తగ్గకుండా నియోజక వర్గంలో పిల్లి రామరాజు చేస్తున్న హడావుడి నియోజకవర్గ వాసుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇంకోవైపు పిల్లి చేస్తున్న హంగామా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు ఇక్కడి నుండి పార్టీ టికెట్ ఆశిస్తున్న ఇతర బీఆర్ఎస్ ఆశవహుల్లో సహజంగానే అసహనం రేకెత్తిస్తోంది.