విధాత: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభా వేదిక పైనుంచి పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతున్నదని, అభివృద్ధి పనుల్లో కేంద్రంతో కలిసి రావడం లేదన్నారు.
కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని, కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారు అన్నారు. కుటుంబపాలన నుంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్దరణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం సభా వేదిక పై నుంచి పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభించాం. భాగ్యలక్ష్మినగరాన్ని వెంకటేశ్వరస్వామి నగరంతో కలిపాం. రాష్ట్రంలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. హైదరాబాద్‌లో ఒకేరోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాం. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాం. ఈ ఏడాది మౌలిక వసతుల కోసం రూ. 10 లక్షలు కేటాయించాం. హైదరాబాద్-బెంగళూరు అనుసంధానాన్ని మెరుగుపరుస్తున్నమన్నారు.
Great vibrancy at the public meeting in Hyderabad. Do watch! https://t.co/XlC3y6hbXR
— Narendra Modi (@narendramodi) April 8, 2023
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్నిభారీగా పెంచుతున్నాం. జాతీయ రహదారుల విస్తరణకు నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాం. రూ. 35 వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో భారీ టెక్స్‌టైల్ పార్క్ నిర్మించనున్నాం. టెక్స్‌టైల్ పార్క్‌తో రైతులు, కార్మికులకు ఎంతో ఉపయోగమని మోడీ అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం బాధపడుతున్నది. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. కుటుంబపాలన, అవినీతి వేర్వేరు కాదు. కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టాం. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు వేస్తున్నాం. డిజిటల్ విధానం ద్వారా దళారీ విధానం లేకుండా చేశాం. అవినీతిపరులకు నిజాయితీతో పనిచేసే వారంటే భయమన్నారు.
PM Shri @narendramodi dedicates and lays foundation stone of various projects in Hyderabad, Telangana. #SwagatamModiJi https://t.co/P8u5uquscl
— BJP (@BJP4India) April 8, 2023
దేశాన్నిఅవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా? అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకోవాలా? వద్ధా? అని ప్రధాని ప్రశ్నించారు. అవినీతిపరులకు కోర్టుల్లోనూ చుక్కెదురవుతున్నది. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశ్వీర్వదించాలని ప్రధాని కోరారు.