విధాత: రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రేడ్డి సారథ్యంలోని వైస్సార్సీపీని ఎదుర్కొనేందుకు శతథా ప్రయత్నిస్తున్న టిడిపి జనసేనలు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయ్.. నువ్ నాకు ఇలా సపోర్ట్ చేస్తే నేన్నీకు అలా హెల్ప్ చేస్తానంటూ క్విడ్ ప్రో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ జనంలోకి వచ్చి హడావుడి చేసి తానున్నానంటూ జనంలో హాజరు వేసుకుని వెళ్తున్నారు. అయితే ఇకముందు ఆయన కొన్నాళ్లపాటు జనంలోకి రావద్దని ఆయన పొలిటికల్ పార్ట్నర్ కంట్రోల్ బాస్ చంద్రబాబు నాయుడు ఆదేశించారట.
ప్రస్తుతం లోకేష్ యువగళం పాద యాత్ర సాగుతున్నవిషయం తెలిసిందే. అయితే ఇప్పుడుగానీ పవన్ కళ్యాణ్ గానీ జనంలో విస్తృతంగా తిరిగితే ప్రజల ఎటెన్షన్ మొత్తం పవన్ వైపు ఉంటుందని, ఇక లోకేష్ యాత్రను ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు భయపడుతున్నారట.
అందుకే పవన్ను కొన్నాళ్లపాటు సినిమాలు చేసుకోవాలని, రాజకీయాలవైపు రావద్దనిచంద్రబాబు చెప్పారట. ఈలోపు లోకేష్ పాదయాత్రకు కాస్త ప్రాచుర్యం వస్తుందని చంద్రబాబు భావన అన్నమాట.. అలాగే గానీ మరి నాకేంటి ? ఆహా..మరి నాకేంటి అని లోకేష్ ప్రశ్నించగా ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు టిడిపి, చంద్రబాబు తరఫున డబ్బు సర్దుబాటు చేశారట. మొత్తానికి ఎవరి లాభాన్ని వాళ్ళు ఇలా వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని తెలుస్తోంది.