వేసవికి ముందే విద్యుత్ కోతలు.. అన్నదాతల ఆందోళనల హోరు!

విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలతో తమ పంటలు ఎండిపోతూ ఆర్థికంగా నష్టపోతున్నామంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ల ముట్టడి రాస్తారోకోలు, ధర్నాలతో హోరేత్తి స్తున్నారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించి సబ్ స్టేషన్ ముట్టడించి అధికారులకు వినతిపత్రం అందించారు. చింతపల్లి మండలం తీదేడు సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు. సాగర్ నియోజక వర్గం పెద్ధవురా మండలం […]

  • Publish Date - February 10, 2023 / 01:33 PM IST

విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలతో తమ పంటలు ఎండిపోతూ ఆర్థికంగా నష్టపోతున్నామంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ల ముట్టడి రాస్తారోకోలు, ధర్నాలతో హోరేత్తి స్తున్నారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలో నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించి సబ్ స్టేషన్ ముట్టడించి అధికారులకు వినతిపత్రం అందించారు.

చింతపల్లి మండలం తీదేడు సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాతో నిరసన వ్యక్తం చేశారు. సాగర్ నియోజక వర్గం పెద్ధవురా మండలం పులిచర్ల గ్రామ రైతులు తమకు కనీసం ఐదారు గంటల కరెంటు కూడా రావడం లేదంటూ పులిచెర్ల సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.

సబ్ స్టేషన్ కార్యాలయం గదికి గడియ వేసి నిరసన తెలిపారు. నకిరేకల్ మండలం కడపర్తి సబ్ స్టేషన్ ను ముట్టడించి రైతులు నిరసన దిగగా పోలీసులు జోక్యం చేసుకొని రైతులను పంపించి వేశారు. రామన్నపేట సబ్ స్టేషన్‌కు వచ్చిన రైతులు అధికారులకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ అందించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.