ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పాదయాత్ర.. ఏడాదిన్నర పాటు
విధాత: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ 'జన్ సురాజ్' ప్రచారం కోసం బీహార్‌లో 3,500 కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్ జిల్లాలో నేడు ఆయన ఈ యాత్ర ప్రారంభించనున్నారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన బితిహర్వా నుంచి ఆయన దీన్ని మొదలు పెట్టనున్నారు. ఇది 12 నుంచి 18 నెలల పాటు సాగనున్నది. రాజకీయాల్లో, ప్రవేశించడానికి ఇది ముందస్తు కసరత్తుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే […]

విధాత: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ ప్రచారం కోసం బీహార్‌లో 3,500 కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్ జిల్లాలో నేడు ఆయన ఈ యాత్ర ప్రారంభించనున్నారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన బితిహర్వా నుంచి ఆయన దీన్ని మొదలు పెట్టనున్నారు. ఇది 12 నుంచి 18 నెలల పాటు సాగనున్నది.
రాజకీయాల్లో, ప్రవేశించడానికి ఇది ముందస్తు కసరత్తుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం ఈ యాత్రలో ప్రజల నిర్ణయం మేరకే తన తదుపరి అడుగులు ఉంటాయని అంటున్నారు. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్తారు. 2018లో జేడీయూలో చేరిన కిశోర్ 2020లో బీహార్ సీఎం నీతీక్ కుమార్‌ను విమర్శించి, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం విధితమే.