స‌త్తా చూపించిన రైతు బిడ్డ‌.. బిగ్ బాస్ కెప్టెన్ కుర్చీ ఎక్కి తానేంటో నిరూపించాడుగా..!

  • By: sn    latest    Oct 07, 2023 2:11 AM IST
స‌త్తా చూపించిన రైతు బిడ్డ‌.. బిగ్ బాస్ కెప్టెన్ కుర్చీ ఎక్కి తానేంటో నిరూపించాడుగా..!

బిగ్ బాస్ సీజ‌న్ 7 శుక్ర‌వారం ఎపిసోడ్ చాలా ఆద్యంతంగా సాగింది. లెట‌ర్స్ త్యాగం చేసుకుంటూ కెప్టెన్సీ కంటెండ‌ర్‌గా నిలిచిన వారు బ‌రిలో నిలిచారు.గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ బ‌రిలో నిలిచేందుకు జంటలుగా ఉన్న హౌజ్‌మేట్స్ ఇద్దరిలో ఒకరు మాత్రమే లెటర్స్ చదవాలి, మరొకరు త్యాగం చేయాలి అని బిగ్ బాస్ చెప్ప‌డంతో సందీప్, అమ‌ర్ దీప్ జంట‌ల‌లో అమ‌ర్ త్యాగం చేశాడు.



సందీప్‌తో పాటు అమ‌ర్ క‌న్నీరు పెట్ట‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది. మరోవైపు శివాజీ, పల్లవి ప్రశాంత్‌ ల వంతు వచ్చినప్పుడు ప్ర‌శాంత్ కోసం త‌న లెట‌ర్‌ని త్యాగం చేశాడు శివాజి. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ కి కొన్ని నీతి సూక్తులు కూడా చెప్పాడు.



రైతు బిడ్డ‌వి అయిన నువ్వు ఈ స్థాయికి రావ‌డం మాములు విష‌యం కాదు. నీ గురించి అంద‌రు గొప్ప‌గా మాట్లాడుకోవాల‌ని, కెప్టెన్ కావాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని శివాజీ అన్నాడు. అయితే శివాజీ త్యాగానికి సంతోషించిన ప్ర‌శాంత్ లెట‌ర్ చ‌దివిని త‌ర్వాత మ‌రింత ఎమోష‌న‌ల్ అయ్యాడు.



ఇక కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాగా, కెప్టెన్సీ పోటీ దారులు వైట్‌ టీషర్ట్ పై ఎక్కువ కలర్‌ ఉంటే వాళ్లు ఔట్‌, తక్కువ కలర్‌ ఉంటే వాళ్లు విన్నర్‌ అని బిగ్ బాస్ తెలియ‌జేశారు. ఈ గేమ్‌లో తేజ, సందీప్‌, ప్రశాంత్‌, గౌతమ్‌ పాల్గొనగా, మొదటి రౌండ్‌లో తేజ, రెండో రౌండ్‌లో సందీప్‌ ఔట్ కాగా, మూడో రౌండ్‌లో ప్రశాంత్‌, గౌతమ్‌ ఉన్నారు. వీరిద్దరి మధ్య హోరా హోరీగా గేమ్ సాగింది. కొట్టుకుంటారేమో కూడా అనిపించింది.



అయితే ఉత్కంఠ‌గా సాగిన గేమ్‌లో కొద్ది పాటి క‌ల‌ర్ త‌క్కువ ఉన్న ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచి ఈ సీజ‌న్ మొద‌టి కెప్టెన్‌గా నిలిచి రైతు బిడ్డ స‌త్తా చూపించాడు. అయితే ఈ గేమ్‌ మధ్యలో సందీప్ నానా హంగామా సృష్టించాడు. ప్రశాంత్‌ తన టీషర్ట్ లాగాడని , సంచలకుడిగా ఉన్న ప్రియాంక ఇది చూడ‌లేదంటూ నానా హంగామా చేశాడు.



మ‌రోవైపు శివాజీ.. ప్ర‌శాంత్‌ని స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని మండిప‌డుతూనే ఉన్నాడు.ఆడియ‌న్స్ చెప్పేది నిజం అయితే నేను వెళ్లిపోతా అంటూ చాలా గుర్రుగా ఉన్నాడు. తన బాధని వ్యక్తం చేస్తూనే అరుస్తూ ఉండ‌డం కాస్త ఓవ‌ర్ యాక్ష‌న్‌గా అనిపించింది. ఇక ఈ రోజు శ‌నివారం కావ‌డం,నాగార్జున ఎంట్రీ ఇవ్వ‌నుండ‌డం ఆయ‌న ఒక్కొక్క‌రికి ఎలాంటి క్లాస్ పీకుతాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.