ఎట్టకేలకి రైతు బిడ్డ సత్తా చూపించిన ప్రశాంత్.. ఇద్దరిని దాటి ఎలా గెలిచాడు..!

ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ లో పవర్ అస్త్ర విలువ ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పవర్ అస్త్ర మొదట దక్కించుకున్న సందీప్ ఐదు వారాల పాటు నామినేషన్స్‌లో లేరు, తర్వాత సంపాదించుకున్న శివాజీ నాలుగు వారాలు,ఆ తర్వాతి వారం దక్కించుకున్న శోభా మూడు వారాలు నామినేషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా పవర్ అస్త్ర కోసం పోటీ జరుగుతుండగా, ఎట్టకేలకి పల్లవి ప్రశాంత్ దానిని దక్కించుకున్నాడు.
తాజా ఎపిసోడ్లో గాలా ఈవెంట్ సందడి చూపించారు. పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండెర్స్ లో ప్రశాంత్, యావర్ ముందే ఎంపిక కాగా, గాలా ఈవెంట్లో అద్భుత ప్రదర్శించిన వారు మరో కంటెండర్ అవుతారని బిగ్ బాస్ అన్నారు. అయితే జడ్జెస్‌గా ఉన్న శివాజీ, సందీప్, శోభా నాలుగో పవరాస్త్ర కంటెండర్‌గా సుబ్బును ఎన్నుకుంటారు.
అయితే ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయంతో అప్సెట్ అయిన అమర్.. కావాలనే తనని కార్నర్ చేస్తున్నారంటూ సీరియస్ అవుతాడు. అయితే శుభ శ్రీ మూడో కంటెండర్ కావడంతో యావర్, ప్రశాంత్, శుభశ్రీకి బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. పట్టు వదలకురా డింభకా అనే టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో పవర్ అస్త్రను ముగ్గురు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు వదిలేస్తే వాళ్ళు రేసు నుండి తప్పుకున్నట్లు అవుతుందని బిగ్ బాస్ అన్నారు. అయితే మిగతా ఇద్దరిని వదిలేయని ఎవరో ఒకరు కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అనే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. కాని ఇవేమి వర్కవుట్ కాలేదు. ఎవరు కూడా పవర్ అస్త్ర వదలకపోయే సరికి బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు.
కదలకురా వదలరా అంటూ ఓ టాస్క్ ఇవ్వగా, ఇందులో గెలిచినవాళ్లకు పవర్ అస్త్ర దక్కుతుంది అని చెప్పారు. అయితే ఈ టాస్క్‌లో శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ గట్టి పోటీ ఇచ్చారు. గేమ్ లో ముందుగా యావర్ ఓడిపోగా, ఆ తర్వాత శుభ శ్రీ సహనం కోల్పోయి పట్టు విడిచింది. కాని సహనంగా ఉన్న పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్రను బోర్డు పై జాగ్రత్తగా పట్టుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ ని డిస్టర్బ్ చేయాలన్న రతికా రోజ్ ప్లాన్ ఏ మాత్రం ఫలించలేదు. మొత్తానికి రైతు బిడ్డ తన సత్తా చూపించి నాలుగు హౌజ్‌మేట్ అయ్యారు. ఇక అతనికి మరో రెండు వారాల పాటు ఎలాంటి సమస్య లేదు. ఇక ఈ రోజు శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఉంటుంది. ఆయన హౌజ్‌మేట్స్‌కి ఎలాంటి చురకలు అంటిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.