President Murmu । సుఖోయ్‌ ఫైటర్‌ జట్‌లో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం

విధాత : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) మొట్టమొదటిసారి సుఖోయ్‌ విమానంలో ప్రయాణించారు. త్రివిధ దళాల అధినేత్రి అయిన రాష్ట్రపతి ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం అసోంలో ఉన్నారు. సోనిత్‌పూర్‌లోని తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి శనివారం ఐఏఎఫ్‌ ఫైటర్‌ జట్‌ సుఖోయ్‌ 30 ఎంకేఐ (Sukhoi-30 MKI)లో గగన విహారం చేశారు. ఆమె వెంట గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌కుమార్‌ తివారి ఉన్నారు. Expressing her appreciation, President Droupadi Murmu wrote in […]

  • Publish Date - April 8, 2023 / 10:13 AM IST

విధాత : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) మొట్టమొదటిసారి సుఖోయ్‌ విమానంలో ప్రయాణించారు. త్రివిధ దళాల అధినేత్రి అయిన రాష్ట్రపతి ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం అసోంలో ఉన్నారు. సోనిత్‌పూర్‌లోని తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి శనివారం ఐఏఎఫ్‌ ఫైటర్‌ జట్‌ సుఖోయ్‌ 30 ఎంకేఐ (Sukhoi-30 MKI)లో గగన విహారం చేశారు. ఆమె వెంట గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌కుమార్‌ తివారి ఉన్నారు.

అంతకు ముందు గువాహటి నుంచి తేజ్‌పూర్‌కు చేరుకున్న ద్రౌపదికి ఎయిర్‌బేస్‌ వద్ద ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌పీ ధర్కర్‌, గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. తొలుత వైమానిక సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణం గురించి అధికారులు ఆమెకు వివరించారు. గతంలో రాష్ట్రపతులుగా పనిచేసిన ఏపీజే అబ్దుల్‌ కలాం, ప్రతిభాపాటిల్‌ తర్వాత సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.