మ‌హిళా ప్రిన్సిప‌ల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఎందుకంటే..?

Bhopal | మార్క్స్ మెమో ఇవ్వ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న మ‌హిళా ప్రిన్సిప‌ల్‌పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని బీఎం ఫార్మ‌సీ కాలేజీలో సోమ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. అశుతోష్ శ్రీవాస్త‌వ‌(22) అనే విద్యార్థి బీఎం ఫార్మ‌సీ కాలేజీలో బీ ఫార్మ‌సీ పూర్తి చేశాడు. అయితే మార్క్స్ మెమో ఇచ్చేందుకు కాలేజీ యాజ‌మాన్యం ఇబ్బందులకు గురి చేస్తోంది. త‌న మార్క్స్ మెమో ఇవ్వాల‌ని సోమ‌వారం సాయంత్రం […]

మ‌హిళా ప్రిన్సిప‌ల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఎందుకంటే..?

Bhopal | మార్క్స్ మెమో ఇవ్వ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న మ‌హిళా ప్రిన్సిప‌ల్‌పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని బీఎం ఫార్మ‌సీ కాలేజీలో సోమ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అశుతోష్ శ్రీవాస్త‌వ‌(22) అనే విద్యార్థి బీఎం ఫార్మ‌సీ కాలేజీలో బీ ఫార్మ‌సీ పూర్తి చేశాడు. అయితే మార్క్స్ మెమో ఇచ్చేందుకు కాలేజీ యాజ‌మాన్యం ఇబ్బందులకు గురి చేస్తోంది. త‌న మార్క్స్ మెమో ఇవ్వాల‌ని సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రిన్సిప‌ల్ విముక్త శ‌ర్మను అశుతోష్ కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలో ప్రిన్సిప‌ల్, విద్యార్థికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

దీంతో అశుతోష్ త‌న వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రిన్సిప‌ల్ విముక్త‌పై పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన గాయాల‌తో ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. అశుతోష్ కూడా 40 శాతం కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్నాడు. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించిన వెంట‌నే కాలిన గాయాల‌తోనే స‌మీపంలో ఉన్న జ‌ల‌పాతంలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై అశుతోష్‌ను అడ్డుకున్నారు.

గతంలో ఫ్యాకల్టీపై క‌త్తితో దాడి..

గ‌తంలో అశుతోష్ బీఎం ఫార్మ‌సీ కాలేజీ ఫ్యాక‌ల్టీపై క‌త్తితో దాడి చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మార్క్స్ మెమో జారీపైనే ఈ దాడి జ‌రిగిన‌ట్లు నిర్ధారించారు. ఈ కేసులో జైలు పాలైన అశుతోష్ వారం రోజుల క్రిత‌మే విడుద‌ల‌య్యాడు. అంత‌లోనే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.