Punganuru | చంద్ర‌బాబు కాన్వాయ్‌పై YCP శ్రేణుల దాడి.. ర‌ణ‌రంగంగా అంగ‌ళ్లు

Punganuru | ర‌ణ‌రంగంగా మారిన అంగ‌ళ్లు పుంగునూరులో పోలీసు వాహ‌నాల‌కు నిప్పు బాబు యాత్ర‌ను నిరసిస్తూ రాస్తారోకో అడ్డుకుంటే తీవ్ర‌ప‌రిణామాలంటూ బాబు హెచ్చ‌రిక‌ విధాత : భ‌విష్య‌త్‌కు భ‌రోసా పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేప‌ట్టిన యాత్ర శుక్ర‌వారం అన్న‌మ‌య్య జిల్లాలో ప్ర‌వేశించింది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు వ‌ద్ద చంద్ర‌బాబుకాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడికి దిగాయి. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కురబలకోటలో చంద్రబాబు మీటింగ్‌కు వెళ్తున్న టీడీపీ […]

  • Publish Date - August 4, 2023 / 01:08 AM IST

Punganuru |

  • ర‌ణ‌రంగంగా మారిన అంగ‌ళ్లు
  • పుంగునూరులో పోలీసు వాహ‌నాల‌కు నిప్పు
  • బాబు యాత్ర‌ను నిరసిస్తూ రాస్తారోకో
  • అడ్డుకుంటే తీవ్ర‌ప‌రిణామాలంటూ బాబు హెచ్చ‌రిక‌

విధాత : భ‌విష్య‌త్‌కు భ‌రోసా పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేప‌ట్టిన యాత్ర శుక్ర‌వారం అన్న‌మ‌య్య జిల్లాలో ప్ర‌వేశించింది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు వ‌ద్ద చంద్ర‌బాబుకాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడికి దిగాయి. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కురబలకోటలో చంద్రబాబు మీటింగ్‌కు వెళ్తున్న టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు విచ‌క్ష‌ణా ర‌హితంగా రాళ్ల దాడి చేశారు. పోలీసులు పక్కనే ఉన్నా రాళ్ల దాడిని నిలువరించలేకపోయారు.

త‌రువాత‌ బస్టాండ్ వద్ద టీడీపీ కార్య‌క‌ర్త‌పై వైసీపీ నాయ‌కులు తీవ్రంగా దాడి చేసి గాయ‌ప‌రిచారు. పోలీసులు వెళ్ల‌డంతో టిడిపి కార్య‌క‌ర్త బ‌తికిబ‌య‌ట‌ప‌డ్డారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసన, రాస్తారోకో చేపట్టారు. చంద్రబాబు అంగళ్లుకు వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ బ్యానర్లను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.

పుంగనూరులో హైటెన్షన్.. పోలీసు వాహనాలకు నిప్పు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు వాహ‌నాల‌కు సైతం నిప్పు పెట్టారు. టిడిపి-వైసీపీ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడుల‌తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులను ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలకు గాయాలవడంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. అన్ని ప్రయత్నాలు అయిపోవడంతో పోలీసులు పారిపోయారు. పుంగనూరు బైపాస్ రోడ్డులో ఉద్రిక్త వాతావరణంతో వాహనాలు ఆగిపోయాయి. మళ్లీ పుంగనూరు టౌన్ లోకి టీడీపీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడానికి భారీగా పోలీసులు తరలివచ్చారు. టీడీపీ కార్యకర్తలపై మళ్లీ పోలీసులు రాళ్ల దాడి చేయగా, మళ్లీ పోలీసులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి చేశారు.

పుంగనూరులో పోలీసుల వజ్రా వాహనం ధ్వంసమవ్వగా, మరొక పోలీసు వాహనానికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. తీవ్ర ఉద్రిక్త‌ల మ‌ధ్య‌నే చంద్ర‌బాబునాయుడు యాత్ర‌ను కొన‌సాగించారు. వైసీపీ నేత‌ల దాడుల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి దాడుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని, మీరు క‌ర్ర‌ల‌తో వ‌స్తే మేమూ క‌ర్ర‌ల‌తో, రాళ్ల‌తో వ‌స్తే రాళ్ల‌తో జ‌వాబు చెబుతామ‌న్నారు. పిల్లిని కూడా క‌ట్టేసి కొడితే పులి అవుతుంద‌ని, ఆ ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్ద‌ని వైసీపీ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు.