Pushpa2 |
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో బన్నీ మేనరిజం, డైలాగులు దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం చూశాం. సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్స్, రాజకీయ నాయకులు కూడా ఇందులోని పాటలకి స్టెప్పులు వేయడం, డైలాగ్స్‌ని అనుకరించడం చేశారు.
ఇక పుష్ప చిత్రం సూపర్ హిట్ కావడంతో పుష్ప2పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్స్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదలైన పోస్టర్ ఏకంగా 7 మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో 7 మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకున్న మొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌గా ఇది సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
పుష్ప దేశవ్యాప్తంగా రూల్ చేస్తున్నాడని, పుష్ప 2 ది రూల్ పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని మేకర్స్ తెలియజేశారు. పుష్పనేకాదు.. పుష్ప పోస్టర్ కూడా తగ్గేదేలా అంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఐకాన్ స్టార్ జోరుకి రికార్డులన్నీ చెరిగిపోవల్సిందే అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Icon Star @alluarjun‘s NATIONWIDE RULE