Python | విధాత: కొండచిలువను చూస్తేనే శరీరంలో వణుకు పుడుతోంది. ప్రమాదకరమైన ఆ సరీసృపం.. జంతువులతో పాటు మనషులను అమాంతం మింగేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఓ 52 ఏండ్ల మహిళను కొండచిలువ మింగేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే.. ఓ జింకను కొండచిలువ సెకన్ల వ్యవధిలోనే మింగేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కొండచిలువ మొదటగా.. జింక తలను నోట్లో పెట్టుకుంది. ఆ తర్వాత గబగబా జింకను మింగేసింది. అయితే ఆ సమయంలో అక్కడున్న కొంతమంది కొండచిలువ శరీరాన్ని నిమిరారు. దాంతో జింకను మింగేందుకు మార్గాన్ని సులువు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలను మాత్రం ఇన్ స్టా గ్రామ్ లో వెల్లడించలేదు.
ఈ వీడియోపై నెటిజన్లు ఈ విధంగా స్పందించారు. నాకు సరీసృపాలంటే అసహ్యం అని ఒక నెటిజన్ రాశాడు. అయితే కొండచిలువలు అంత వేగంగా జంతువులను తినేయలేవు. కానీ అందుకు రివర్స్ గా ఈ కొండచిలువ జింకను మింగేసిందని పేర్కొన్నారు.