Rabbit | పెంపుడు కోతులు, కుందేళ్లు, కుక్కలు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో మనసుకు హత్తుకునేలా ప్రవర్తిస్తుంటాయి. ఆ జంతువులకు సంతోషం వస్తే ఆగలేవు. ఏదేదో చేసేస్తుంటాయి. ఆ మాదిరిగానే ఓ కుందేలు కూడా ప్రవర్తించింది.
యోగ్ అనే ఓ నెటిజన్.. తన ట్విట్టర్ ఖాతాలో కుందేలు వీడియోను పోస్టు చేశాడు. బ్లూ కలర్ సోఫాపై ఉన్న బెడ్‌షీట్‌తో కుందేలు ఆటాడుకుంది. ఆ బెడ్ షీట్‌ను అటు ఇటు తిప్పుతూ, నోటితో పట్టుకుని ఎంజాయ్ చేసింది. కుందేలు ఆ బెడ్ షీట్‌ను కప్పుకుని కల్లు తాగిన కోతిలా ప్రవర్తించింది. ఈ వీడియోను నవంబర్ 20న షేర్ చేయగా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 2.8 మిలియన్ల మంది వీక్షించగా, 1.5 లక్షల మంది లైక్ చేశారు.
Mood…