Rahul Disqualification | ఆ బంగ్లాతో ఎంతో అనుబంధం.. తీపి గుర్తులు మ‌రిచిపోలేనివి: రాహుల్ గాంధీ

విధాత‌: లోక్‌స‌భ నుంచి అన‌ర్హ‌త వేటు(Disqualification)కు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. అధికారిక బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు పార్ల‌మెంట్ మెంబ‌ర్స్ సెక్ష‌న్ బ్రాంచ్‌కు లేఖ రాశారు. అధికారిక బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు లేఖ‌లో రాహుల్ తెలిపారు. లోక్‌స‌భ స‌చివాల‌యం చెప్పిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తాను. తుగ్ల‌క్ రోడ్డులోని బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన నేను ప్ర‌జ‌ల తీర్పును పాటిస్తా. […]

Rahul Disqualification | ఆ బంగ్లాతో ఎంతో అనుబంధం.. తీపి గుర్తులు మ‌రిచిపోలేనివి: రాహుల్ గాంధీ

విధాత‌: లోక్‌స‌భ నుంచి అన‌ర్హ‌త వేటు(Disqualification)కు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. అధికారిక బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు పార్ల‌మెంట్ మెంబ‌ర్స్ సెక్ష‌న్ బ్రాంచ్‌కు లేఖ రాశారు.

అధికారిక బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు లేఖ‌లో రాహుల్ తెలిపారు. లోక్‌స‌భ స‌చివాల‌యం చెప్పిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తాను. తుగ్ల‌క్ రోడ్డులోని బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు.

నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన నేను ప్ర‌జ‌ల తీర్పును పాటిస్తా. ఎంపీగా ఉన్న‌ప్పుడు కేటాయించిన బంగ్లాతో ఎంతో అనుబంధం ఉంది. బంగ్లాతో ఉన్న తీపి గుర్తులు మ‌రిచిపోలేనివి అని రాహుల్ త‌న లేఖ‌లో వివ‌రించారు. అధికారిక బంగ్లా ఖాళీ చేయాల‌ని రాహుల్‌కు లోక్‌స‌భ స‌చివాల‌యం నిన్న లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.

మోదీ ఇంటి పేరుతో దూషించిన ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ సూర‌త్ కోర్టు తీర్పునిచ్చిన విష‌యం విదిత‌మే. దీంతో ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఆ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. అన‌ర్హ‌త వేటు ప‌డిన‌ప్ప‌టి నుంచి నెల రోజుల్లోపు రాహుల్ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో తుగ్ల‌క్ రోడ్డులోని అధికారిక బంగ్లాను ఏప్రిల్ 22వ తేదీలోగా ఖాళీ చేయాల‌ని రాహుల్‌కు లోక్‌స‌భ హౌసింగ్ క‌మిటీ సోమ‌వారం నోటీసులు జారీ చేసింది.