Rahul Gandhi | రాహుల్ గాంధీ అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిందేనా..?

Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ( Congress Party ) మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు ప‌డిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో రాహుల్ త‌న అధికారిక బంగ్లాను( Official House ) ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ఈ వ్య‌వ‌హారంలో ఉన్న‌త న్యాయస్థానం నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోతే.. రాహుల్ త‌ప్ప‌కుండా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం మార్చి […]

Rahul Gandhi | రాహుల్ గాంధీ అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిందేనా..?

Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ( Congress Party ) మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు ప‌డిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో రాహుల్ త‌న అధికారిక బంగ్లాను( Official House ) ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అయితే ఈ వ్య‌వ‌హారంలో ఉన్న‌త న్యాయస్థానం నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భించ‌క‌పోతే.. రాహుల్ త‌ప్ప‌కుండా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం మార్చి 23 నుంచి నెల రోజుల్లోపు రాహుల్ అధికారిక బంగ్లాను ఖాళీ చేసి త‌న సొంత నివాసానికి వెళ్లాల్సి ఉంటుంది.

2004 సాధార‌ణ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. అప్ప‌ట్నుంచి రాహుల్‌కు తుగ్ల‌క్ వీధిలోని 12వ నంబ‌ర్ బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి రాహుల్ అదే బంగ్లాలో ఉంటున్నారు. ఇప్పుడు అన‌ర్హ‌త వేటు ప‌డ‌టంతో.. ప్ర‌భుత్వ బంగ్లాలో ఉండ‌టానికి రాహుల్ అర్హుడు కాడ‌ని ఓ అధికారి తెలిపారు.