Rahul Gandhi | భారతదేశం కోసం పోరాడుతున్నా.. దేనికైనా సిద్ధం: రాహుల్‌ గాంధీ

ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధం అనర్హత వేటు అనంతరం రాహుల్‌ వ్యాఖ్యలు విధాత: అనర్హత వేటు పడినప్పటికీ బెదిరేది లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. తాను భారతదేశ గొంతు వినిపించేందుకు పోరాడుతున్నానని చెప్పారు. సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించిన విషయం విదితమే. मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं। मैं हर कीमत चुकाने को तैयार […]

  • Publish Date - March 24, 2023 / 01:01 PM IST
  • ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధం
  • అనర్హత వేటు అనంతరం రాహుల్‌ వ్యాఖ్యలు

విధాత: అనర్హత వేటు పడినప్పటికీ బెదిరేది లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. తాను భారతదేశ గొంతు వినిపించేందుకు పోరాడుతున్నానని చెప్పారు. సూరత్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించిన విషయం విదితమే.

దీనిపై ఆయన స్పందిస్తూ.. భారతదేశం కోసం పోరాడుతున్నానని, ఈ క్రమంలో ఎంతటి మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమేనని హిందీలో ట్వీట్‌ చేశారు. అనేక మంది విపక్ష రాజకీయ నాయకులు రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని ఖండించారు.

దేశం చాలా క్లిష్టపరిస్థితుల మీదుగా సాగుతున్నదని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. దేశం మొత్తాన్నీ భయకంపితులను చేస్తున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు. వారి నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే తన చర్యను ఉపసంహరించుకోవాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.