రైలు ఎక్కుతుండగా జారిపడ్డ చిన్నారి.. కాపాడిన రైల్వే పోలీసు.. వీడియో

Train accident | అది ముంబైలోని మన్ కుర్ద్ రైల్వేస్టేషన్. ప్లాట్ ఫాంలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రెండో నంబర్ ప్లాట్ ఫాం మీదకు లోకల్ ట్రైన్ వచ్చేసింది. ఇక ప్రయాణికులందరూ ఎక్కేస్తున్నారు. అంతలోనే రైలు ముందుకు కదలింది. ఓ తల్లి తన చిన్నారితో కలిసి కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న బిడ్డ జారిపోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అక్షయ్ సోయే గమనించాడు. హుటాహుటిన పరుగెత్తి.. రైల్వే ట్రాక్ […]

  • Publish Date - November 4, 2022 / 01:12 AM IST

Train accident | అది ముంబైలోని మన్ కుర్ద్ రైల్వేస్టేషన్. ప్లాట్ ఫాంలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రెండో నంబర్ ప్లాట్ ఫాం మీదకు లోకల్ ట్రైన్ వచ్చేసింది. ఇక ప్రయాణికులందరూ ఎక్కేస్తున్నారు. అంతలోనే రైలు ముందుకు కదలింది.

ఓ తల్లి తన చిన్నారితో కలిసి కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె చేతిలో ఉన్న బిడ్డ జారిపోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అక్షయ్ సోయే గమనించాడు. హుటాహుటిన పరుగెత్తి.. రైల్వే ట్రాక్ పై పడబోతున్న చిన్నారిని తన చేతులతో పైకి లాగేశాడు.

చిన్నారి తల్లిని కూడా మిగతా ప్రయాణికులు ప్రాణాలతో కాపాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిన్నారి ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసు అక్షయ్ పై రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.