Viral Video | నెత్తిన సంచులను పెట్టుకున్న ఓ ఇద్దరు ముసలోళ్లు.. రైలు పట్టాలను దాటుతూ ప్లాట్ ఫాం ఎక్కేందుకు యత్నించారు. అంతలోనే ఓ గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు అప్రమత్తమై ఆ ఇద్దరిని ప్లాట్ ఫాంపైకి లాగేశారు. ఆ ఇద్దరు ముసలోళ్లు ప్లాట్ ఫాం ఎక్కేందుకు ఇబ్బంది పడ్డారు. ఒక రైల్వే పోలీసులు వారిని పైకి లాగకపోతే ప్రమాదం జరిగేది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డుగా, ఆ వీడియోలను రైల్వే అధికారులు విడుదల చేశారు.
ఇద్దరు ముసలోళ్లను కాపాడిన రైల్వే పోలీసులపై అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రయాణికులు ఎవరూ కూడా రైలు పట్టాలు దాటొద్దని, స్టేషన్‌లో ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
सुरक्षा ही सर्वोपरि!
मध्य प्रदेश के होशंगाबाद रेलवे स्टेशन पर सतर्क आरपीएफ एवं जीआरपी के जवानों ने पटरी पार कर रहीं दो बुजुर्ग महिलाओं की जान बचाई।
कृपया एक प्लेटफॉर्म से दूसरे प्लेटफॉर्म पर जाने के लिए सदैव फुटओवर ब्रिज का इस्तेमाल करें। pic.twitter.com/mb2DKrFYVK
— Ministry of Railways (@RailMinIndia) December 20, 2022