విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు మహిళల మృతదేహాలకు రాజగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికీ ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాల పిల్లలకు విద్య భోదన ఖర్చులు భరిస్తానని ప్రకటించారు.