బుల్లెట్ ప్రూఫ్ వాహనం వదిలి.. బుల్లెట్‌పై అసెంబ్లీకి రాజాసింగ్

విధాత: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ది రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక శైలి.. ఆయన వైఖరి తరచూ వివాదస్పదం.. ఇటీవల ఆయన ఏది చేసినా.. ఏది మాట్లాడినా అది హాట్ టాపిక్.. తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ రిపేర్లకు గురవుతుండటాన్ని నిరసిస్తూ నిన్న ప్రగతిభవన్ వద్ద దానిని వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించి హల్చల్ చేశారు. నేడు శనివారం ఏకంగా తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని.. భద్రత ను సైతం వదిలేసి బుల్లెట్ […]

  • Publish Date - February 11, 2023 / 10:07 AM IST

విధాత: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ది రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక శైలి.. ఆయన వైఖరి తరచూ వివాదస్పదం.. ఇటీవల ఆయన ఏది చేసినా.. ఏది మాట్లాడినా అది హాట్ టాపిక్.. తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ రిపేర్లకు గురవుతుండటాన్ని నిరసిస్తూ నిన్న ప్రగతిభవన్ వద్ద దానిని వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించి హల్చల్ చేశారు.

నేడు శనివారం ఏకంగా తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని.. భద్రత ను సైతం వదిలేసి బుల్లెట్ బైక్ స్వయంగా నడుపుకుంటూ రాజాసింగ్ అసెంబ్లీకి వచ్చి మరోసారి హల్చల్ చేశారు. హెల్మెట్ పెట్టుకొని బుల్లెట్ నడుపుకుంటూ వచ్చిన రాజాసింగ్‌ను అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు ఆపివేశారు.

ఈ తర్వాత ఆయనను ఎమ్మెల్యే రాజాసింగ్‌గా గుర్తించిన పోలీసులు నివ్వెరపోయారు. ఆ వెంటనే తేరుకున్న పోలీసులు రాజాసింగ్‌ను అసెంబ్లీలోనికి అనుమతించారు. ప్రభుత్వం తనకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలని ఈ సందర్భంగా మరోసారి రాజాసింగ్ డిమాండ్ చేశారు.