Rajasthan Assembly Election | కర్ణాటక విజయంతో గెహ్లాట్‌, పైలట్‌కు ఖర్గే పిలుపు!

Rajasthan Assembly Election డిసెంబర్‌లో రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య గొడవలతో ఇబ్బందులు ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ తయారీ కోసం పిలుపు ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు యత్నాలు విధాత: సీనియర్లకు, జూనియర్లకు మధ్య నిత్యం కలహాలు ఉండే పార్టీగా పేరున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు అదే తరహా రాజకీయం నడుస్తున్న రాజస్థాన్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే అక్కడ సంస్థాగత ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. […]

Rajasthan Assembly Election | కర్ణాటక విజయంతో గెహ్లాట్‌, పైలట్‌కు ఖర్గే పిలుపు!

Rajasthan Assembly Election

  • డిసెంబర్‌లో రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు
  • ఇద్దరు నేతల మధ్య గొడవలతో ఇబ్బందులు
  • ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ తయారీ కోసం పిలుపు
  • ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు యత్నాలు

విధాత: సీనియర్లకు, జూనియర్లకు మధ్య నిత్యం కలహాలు ఉండే పార్టీగా పేరున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు అదే తరహా రాజకీయం నడుస్తున్న రాజస్థాన్‌పై దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే అక్కడ సంస్థాగత ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కు, సచిన్‌ పైలట్‌కు మధ్య విభేదాల పరిష్కారానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నడుం కట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం లేదన్న వార్తల నేపథ్యంలో డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసే విషయంలో ఢిల్లీకి రావాల్సిందిగా గెహ్లాట్‌, పైలట్‌లను ఖర్గే ఆదేశించారని తెలుస్తున్నది. నిజానికి పదిహేను రోజుల క్రితమే గెహ్లాట్‌, పైలట్‌తో మాట్లాడేందుకు పార్టీ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్‌, కేసీ వేణుగోపాల్‌ను ఖర్గే పంపారు. రాజస్థాన్‌లో ఇద్దరు నేతల మధ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నం చేశారు.

ఏఐసీసీ కార్యదర్శిగా నియమించడంతోపాటు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించేందుకు ప్రతిపాదించినా.. తాను 9 ఏళ్లుగా రాజస్థాన్‌లోనే పనిచేస్తున్నానంటూ పైలట్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని సమాచారం. అదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని యువతకు కేటాయించాలని ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు ఖర్గే గట్టిగానే చెప్పారని తెలిసింది. తనకు ఆర్‌పీసీసీ చీఫ్‌ పదవి ఇస్తే తీసుకోవడానికి సచిన్‌ పైలట్‌ సానుకూలంగానే ఉన్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో టికెట్లు ఎవరికి కేటాయించాలనే విషయంలో పట్టు ఉంటుందనే కారణంతో సచిన్‌ అందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

ఏది ఏమైనా పార్టీలో క్రమశిక్షణ పాటించడం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ఖర్గే భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ‘ముందు పార్టీ.. ఆ తర్వాతే ఇతర విషయాలన్నీ’ అనే సూత్రంతోనే పనిచేయాలని ఇద్దరు నేతలకు ఆయన కరాఖండితంగా చెప్పారని తెలుస్తున్నది.

రాజస్థాన్‌లో ఇంటిని చక్కదిద్దడంలో తాను చేసే ప్రయత్నాలకు సోనియా, రాహుల్‌, ప్రియాంక మద్దతు ఉంటుందని ఆయన నమ్ముతున్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో ఆయన ఎంత వరకు సఫలమవుతారో చూడాలి.