విధాత, సినిమా: రెండు రోజులుగా సోషల్ మీడియాలో ‘ఏంటమ్మా’ అనే ట్యాగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. 48 గంటల పాటు ఈ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అయింది. అసలీ ‘ఏంటమ్మ’ కథ ఏంటి? ఎందుకు అంత సేపు ట్రెండ్ అయింది అనేది తెలుసుకోవాలంటే.. ముందుగా ‘గాడ్‌ఫాదర్’ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఆ సినిమాలో చేసినందుకు.. సల్మాన్ రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చెప్పారు. ఆ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్‌ల బాండింగ్ ఎలా ఉంటుందో.. పలు సందర్భాలలో రామ్ చరణ్ తెలిపారు. తనని సొంత కొడుకులా సల్మాన్ ట్రీట్ చేస్తాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పాడు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తనకు అండగా ఉంటారని కూడా చరణ్ తెలిపి ఉన్నాడు. మరి అలాంటి సల్మాన్ సాయాన్ని రామ్ చరణ్ ఊరికే ఉంచుకోగలడా. అందుకే వెంటనే ఆ రుణాన్ని తీర్చేసుకున్నాడు.
One of my most precious on screen moments.
Love you Bhai ❤️Dancing with these absolute legends… #Yentamma song out now.https://t.co/9gSJhidu0y@BeingSalmanKhan @hegdepooja @VenkyMama @farhad_samji @VishalDadlani @iPayalDev @raftaarmusic @Musicshabbir @AlwaysJani pic.twitter.com/raRa2zl8Zy
— Ram Charan (@AlwaysRamCharan) April 4, 2023
సల్మాన్ ఖాన్ హీరోగా.. తమిళ ‘వీరమ్’ చిత్రానికి రీమేక్ (పవన్ కల్యాణ్ రీమేక్ చేసిన ‘కాటమరాయుడు’)గా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ పేరుతో ఓ చిత్రం బాలీవుడ్‌లో రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశాడు. రీసెంట్‌గా ఈ సినిమాలో ‘ఏంటమ్మా’ అనే వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్‌లతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన డాన్స్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్యమాల్లో కలిపి 43 ప్లస్ మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకెళుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఎంట్రీ ఈ పాటకు ప్లస్‌గా నిలిచింది. ఇప్పుడు రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ రేంజ్. ఈ పాటలో చరణ్ కనిపించడంతో గ్లోబల్‌గా ఈ పాట వైరల్ అవుతోంది. ఈ పాటలో గెస్ట్ అప్పీయరెన్స్‌కు సంబంధించి తాజాగా రామ్ చరణ్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలోని ఏంటమ్మా సాంగ్‌ను చేసేటప్పుడు యమా ఎంజాయ్ చేశాం. అందరం కలిసి అదర గొట్టేశాం. ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో కలిసి నేను ఏంటమ్మా సాంగ్‌లో నటించటం కల నిజమైనట్లుగా ఉంది. మరచిపోలేని అనుభూతి ఇది. ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండగలా ఉంటుంది.
ఈ పాటలో కనిపించని ఎనర్జీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఏంటమ్మా పాట విషయానికి వస్తే.. పాయల్ దేవ్ సంగీత సారథ్యం వహించగా విశాల్ డడ్లాని, పాయల్ దేవ్, రఫ్లార్ ఆలపించారు. షబీర్ అహ్మద్ సాహిత్యాన్ని అందించగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న విడుదల కానుంది.