ఏపీ డీజీపీకి రాంగోపాల్ వర్మ ఫిర్యాదు
తన తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానన్న టీడీపీ సానుభూతిపరుడుశ్రీనివాస రావుపై దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు

విధాత : తన తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానన్న టీడీపీ సానుభూతిపరుడు, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస రావుపై దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు. తనను చంపేందుకు కుట్ర జరుగతుందని, ఇందుకు తాజాగా టీవీ డిబెట్‌లో కొలికపూడి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అతనిపై చర్యలు తీసుకోవాలని వర్మ కోరారు.