రామన్న.. ‘దేవుడు ఉన్నాడో లేడో తెలియదు’ కానీ నువ్వు మాకున్నావ్
విధాత: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆపదలో ఉన్న వారిని క్షణాల్లోనే ఆదుకుంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని లేదా ఆపదలో ఉన్నామని కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే చాలు.. తనకు చేతనైనంతా సహాయాన్ని అందిస్తారు. అలా అనేక మంది నిరుపేదల ప్రాణాలను కేటీఆర్ కాపాడారు.. కాపాడుతూనే ఉన్నారు. తమ బాబును ప్రాణాలతో కాపాడిన కేటీఆర్‌కు బాధిత కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మీరు తక్షణమే స్పందించి, అందించిన సహాయం వల్ల ఇవాళ తమ బాబు మంచిగా […]

విధాత: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆపదలో ఉన్న వారిని క్షణాల్లోనే ఆదుకుంటారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని లేదా ఆపదలో ఉన్నామని కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే చాలు.. తనకు చేతనైనంతా సహాయాన్ని అందిస్తారు. అలా అనేక మంది నిరుపేదల ప్రాణాలను కేటీఆర్ కాపాడారు.. కాపాడుతూనే ఉన్నారు.
తమ బాబును ప్రాణాలతో కాపాడిన కేటీఆర్‌కు బాధిత కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మీరు తక్షణమే స్పందించి, అందించిన సహాయం వల్ల ఇవాళ తమ బాబు మంచిగా ఉన్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది. వెరీ వెరీ థ్యాంక్యూ.. రామన్న.. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ నీవు మాకు ఉన్నావని ఒక ధైర్యం. ఆ ఏడు కొండల స్వామి మీకు వెయ్యేండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు.
ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ.. ప్రజా జీవితంలో అన్నిటి కన్నా తృప్తిని ఇచ్చే సందర్భాలలో ఇలాంటి సందేశం ఒకటి అని పేర్కొన్నారు. వెంకటేష్ ముదిరాజ్ అనే సోదరుడు చిట్యాల మండలం నుండి పంపిన మెసేజ్ ఇది. మీ కుమారుడు ఆరోగ్యంగా ఉండటం సంతోషాన్ని ఇస్తుందన్నారు కేటీఆర్.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్(11 నెలలు) ఉన్నాడు. 2021, అక్టోబర్ నెలలో వేడి పాలు పడి బాలుడి శరీరం కాలింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో రూ.2 లక్షలకు పైగా ఖర్చుచేసి చికిత్స చేయించా .
మరో వారం రోజులు చికిత్స అందించాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలోఉన్నారు. వీరి పరిస్థితిని ట్విట్టర్ ద్వారా తెలుసుకొన్న కేటీఆర్ వెంటనే స్పందించారు. బాలుడి చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బాలుడికి వైద్యం చేయించి, కేటీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారు.