White Snake | వర్షాలు పడ్డాయంటే చాలు.. పాములు ప్రత్యక్షమవుతుంటాయి. పొలాల్లో, జవాసాల్లో పాములు కనిపిస్తూనే ఉంటాయి. అలా జనవాసాల్లోకి వచ్చే పాములు చాలా వరకు నలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటిని చూసే సరికి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. కానీ ఈ పామును చూస్తే మాత్రం చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి భయం అనిపించదు. ఎందుకంటే ఆ పాము చూడటానికి తెలుపు రంగులో ఉంది. ఆరేడు అడుగుల పొడవున్న ఆ తెలుపు రంగు పాము చూపరులను […]
White Snake | వర్షాలు పడ్డాయంటే చాలు.. పాములు ప్రత్యక్షమవుతుంటాయి. పొలాల్లో, జవాసాల్లో పాములు కనిపిస్తూనే ఉంటాయి. అలా జనవాసాల్లోకి వచ్చే పాములు చాలా వరకు నలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటిని చూసే సరికి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి.
కానీ ఈ పామును చూస్తే మాత్రం చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి భయం అనిపించదు. ఎందుకంటే ఆ పాము చూడటానికి తెలుపు రంగులో ఉంది. ఆరేడు అడుగుల పొడవున్న ఆ తెలుపు రంగు పాము చూపరులను ఆకర్షిస్తుంది.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో కురిసిన వర్షాలకు ఆ తెలుపు రంగు పాము ప్రత్యక్షమైంది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ పామును స్థానికులు తమ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు ఓ లుక్కేయండి మరి.