Rashi Khanna: రాశీ ఖన్నా.. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన ఈ భామ ఇప్పుడు స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతుంది. టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న రాశీ.. బాలీవుడ్, కోలీవుడ్‌లలో సందడి చేస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా హంగామా చేస్తుంది. రాశీ ఖన్నా చివరిగా తెలుగులో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు చేయగా, ఇవి దారుణమైన డిజాస్టర్స్‌గా మారాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మేకర్స్ ఆమెకి అవకాశాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం తమిళంలో నాలుగు […]
Rashi Khanna: రాశీ ఖన్నా.. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన ఈ భామ ఇప్పుడు స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతుంది. టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న రాశీ.. బాలీవుడ్, కోలీవుడ్‌లలో సందడి చేస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా హంగామా చేస్తుంది.
రాశీ ఖన్నా చివరిగా తెలుగులో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు చేయగా, ఇవి దారుణమైన డిజాస్టర్స్‌గా మారాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మేకర్స్ ఆమెకి అవకాశాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలు, హిందీలో యోధ అనే సినిమా చేస్తుంది. ఇక ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రాశీ ఖన్నా అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటుంది. తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గతంలో రాశీ ఖన్నా ఓ వ్యక్తితో డేటింగ్లో ఉండి అతనికి బ్రేకప్ చెప్పింది. దాంతో డిప్రెషన్లోకి వెళ్లడం, అలానే తనని థైరాయిడ్ సమస్య వేధించడంతో బాగా బరువు పెరిగిందట. ఎన్ని వర్కవుట్స్ చేసిన, జిమ్ కోచ్ మార్చిన కూడా ఉపయోగం లేకుండా పోయిందట. దాంతో సినిమా అవకాశాలు కూడా తనకి తగ్గాయని రాశీ పేర్కొంది.
అయితే తనని అర్ధం చేసుకునే వ్యక్తి దొరికాడం, అతనితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాతే రాశీ ఖన్న బరువు తగ్గి.. స్లిమ్ గా మారిందట. తాను అనుకున్నట్లుగా మారిందని రాశీ ఖన్నా అంటుంది.. అయితే ఇక్కడ రాశీ ఖన్నా చెప్పిన వ్యక్తి ఎవరనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తుంది.
తాను డేటింగ్లో ఉన్న అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరో కూడా చెబితే బాగుండేది కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డేటింగ్ వల్ల వెయిట్ లాస్ అవుతారంటే.. ఇప్పుడు అందరు అదే పాటిస్తారేమో రాశి అని అందరు ఆమెపై సెటైర్స్ వేస్తున్నారు. మొత్తానికి రాశీ ఖన్నా తను కూడా ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నదని చెప్పగా, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందా అని ముచ్చటించుకుంటున్నారు.