డేటింగ్ విషయం కన్‌ఫాం చేసిన రష్మిక.. విషయం ఎలా బయటకు వచ్చిందంటే..!

అందాల ముద్దుగుమ్మ రష్మిక, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో కలిసి నటించగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఎన్ని ప్రచారాలు సాగిన కూడా వారిద్దరు తమ రిలేషన్ గురించి మాత్రం నోరు మెదపడం లేదు. పలు మార్లు ఈ ఇద్దరు వెకేషన్‌లో కనిపించడంతో పాటు సేమ్ టైమ్‌లో ఎయిర్ పోర్ట్ లో సందడి చేయగా, వారిద్దరు ఒకే ప్లేస్‌లో ఉన్నారని ప్రచారాలు సాగాయి. అయితే ఎట్టకేలకి తమ రిలేషన్ షిప్ గురించి క్లియర్ హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మిక.
తాజాగా ఆమె క్లీయర్ కట్ హింట్ ఇచ్చేసింది. రష్మిక టర్కీలో వెకేషన్‌కి వెళ్లిన ఓ ఫోటోని, వీడియోని పంచుకోవడంతో పాటు దానికి కాప్షన్‌గా `డెస్టినేషన్` అని, రెండవది `తనని తాను కనిపెడుతున్నానని, ట్రావెలింగ్ డేస్ ని మిస్ అవుతున్నట్టు తెలియజేసింది. అయితే ఆ ఫొటోలు ఇప్పటివి కావని మే నెలలో దిగిన ఫొటోలుగా నెటిజన్స్ పసిగట్టారు.
అయితే అప్పుడు లొకేషన్‌లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్టుగా తెలుస్తుండగా, ఆయన టిఫిన్ చేస్తూ కనిపించాడు. అది ఖుషి` సినిమా షూటింగ్ టైమ్ అని, విజయ్, సమంతలతోపాటు రష్మిక కూడా అక్కడే ఉందని, అందుకే అదే డెస్టినేషన్‌లో తాను ఫోటో దిగిందని కొందరు ముచ్చటిస్తున్నారు. ప్రూఫ్ చూపిస్తూ రష్మిక, విజయ్‌లు డేటింగ్‌లో ఉన్నారని చెప్పుకు రావడంతో ఇప్పుడు వారిద్దరి పేర్లు హట్ టాపిక్‌గా మారాయి.
ఇక ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ఆమెకి డేట్స్ కుదరకపోవడంతో రష్మికని తీసుకున్నారు. ఈక్రమంలో ముచ్చటగా మూడోసారి ఈ జంట కలిసి సందడి చేయనుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. `యానిమల్` అనే చిత్రంలో నటిస్తుండడంతో పాటు తెలుగులో `పుష్ప2` లో నటిస్తుంది. అలాగే `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తుంది.