ఆ హీరోకి రష్మిక ఘాటు లిప్‌లాక్.. విజయ్ దేవరకొండ ఏమై పోవాలి..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అయితే రష్మికకి ఈ మధ్య సరైన హిట్స్ లేకపోవడంతో గ్లామర్‌తో హద్దులు చెరిపేస్తుంది. అలానే లిప్‌లాక్‌లకి సైతం సై అంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా చిత్రం డైరెక్షన్ లో చేస్తుంది. యానిమల్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండగా , ఇందులో రణ్‌బీర్ కపూర్ భార్యగా నటించనుంది. తాజాగా యానిమల్ మూవీ నుండి రొమాంటిక్ పోస్టర్ వదిలారు. ఇందులో హీరో హీరోయిన్ లిప్ కిస్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. పోస్టర్ చూసి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మరింతగా ఉంటాయని భావిస్తున్నారు. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లిప్ లాక్ సన్నివేశాలకు ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఆయన టాలీవుడ్ ని షేక్ చేయగా, ఈ చిత్రంలో ముద్దు సీన్లు ఎంత చర్చకు దారి తీసాయో మనం చూశాం.
అర్జున్ రెడ్డి చిత్రంలోని లిప్ లాక్ సన్నివేశాల గురించి అప్పట్లో పెద్ద ఎత్తున టీవీ డిబేట్లు కూడా పెట్టారు. చిత్రం నుండి లిప్ లాక్ సన్నివేశాలు తొలగించాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే అప్పుడు వచ్చిన విమర్శలపై సందీప్ స్పందిస్తూ.. ప్రేమలోని ఘాడత చెప్పాలంటే ముద్దు సీన్స్ తప్పనిసరి అని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు యానిమల్ అనేది బాలీవుడ్ చిత్రం కాగా, దీనిపై పెద్దగా డిస్కషన్ ఉండకపోవచ్చు అని కొందరి మాట. సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా కొంత వ్యతిరేఖత వచ్చింది. అయితే జనాలు మాత్రం ఈ సినిమాని తెగ చూసేశారు. ఇక ఇప్పుడు రణ్‌బీర్- రష్మిక పెదాలని జుర్రుకుంటున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసి మూవీపై మాత్రం భారీ అంచానాలే పెంచారు.
ఇందులో సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం యానిమల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనుంది. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేయనుండగా, చిత్ర ట్రైలర్ మాత్రం మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచింది.