RaviTeja | రిస్క్ చేస్తున్న ర‌వితేజ.. దేశాన్ని కుదిపేసిన హ‌త్యాకాండ నేప‌థ్యంలో సినిమా!

RaviTeja | ప్ర‌యోగాల‌కి కేరాఫ్ అడ్రెస్ ర‌వితేజ అని చెప్పొచ్చు.ఆయన త‌న కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు.ఇప్ప‌టికీ కూడా ర‌వితేజ వ‌రుస చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఆయ‌న న‌టించిన‌ చిత్రాల‌లో కొన్ని మంచి విజ‌యాలు సాధించ‌గా, మ‌రికొన్ని మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. ఇటీవ‌లి కాలంలో రవ‌తేజ‌కి పెద్ద‌గా స‌క్సెస్‌లు అని రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో త‌న‌కి అచ్చొచ్చిన డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా […]

  • By: sn    latest    Jul 10, 2023 6:15 AM IST
RaviTeja | రిస్క్ చేస్తున్న ర‌వితేజ.. దేశాన్ని కుదిపేసిన హ‌త్యాకాండ నేప‌థ్యంలో సినిమా!

RaviTeja |

ప్ర‌యోగాల‌కి కేరాఫ్ అడ్రెస్ ర‌వితేజ అని చెప్పొచ్చు.ఆయన త‌న కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు.ఇప్ప‌టికీ కూడా ర‌వితేజ వ‌రుస చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఆయ‌న న‌టించిన‌ చిత్రాల‌లో కొన్ని మంచి విజ‌యాలు సాధించ‌గా, మ‌రికొన్ని మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి.

ఇటీవ‌లి కాలంలో రవ‌తేజ‌కి పెద్ద‌గా స‌క్సెస్‌లు అని రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో త‌న‌కి అచ్చొచ్చిన డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు ర‌వితేజ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇప్ప‌టికే బలుపు, క్రాక్, డాన్ శీను లాంటి మాస్ హిట్స్ రూపొంది మంచి విజ‌యం సాధించాయి.