Realme 12 Pro Plus | భారత్‌లో రియల్‌మీ 12ప్రో సిరీస్‌ లాంచ్‌..!

చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ 12ప్రో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. మొబైల్స్‌ విక్రయాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి

  • Publish Date - January 30, 2024 / 05:35 AM IST
  • ఫీచర్స్‌, ధర, సేల్స్‌ వివరాలు ఇవే..!

Realme 12 Pro Plus | చైనాకు చెందిన ప్రముఖ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ ఇటీవల కొత్త సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ 12ప్రో సిరీస్‌ మొబైల్స్‌ విక్రయాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. సిరీస్​లోని గ్యాడ్జెట్స్​, వాటి ఫీచర్స్​, ధరల వివరాలు మీ కోసం.. రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్స్​లో కర్వ్​డ్​ డిస్​ప్లే, టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​ డిజైన్‌తో వస్తున్నది. పవర్​ బటన్​, వాల్యూ బటన్​ రైట్​ సైడ్​లో ఉంటుంది. టైప్​-సీ పోర్ట్​, సిమ్​ ట్రే, ప్రైమరీ మైక్రోఫోన్​, స్పీకర్​ కింది భాగంలో ఇవ్వగా.. రియర్‌లో సర్క్యులర్​ కెమెరా మాడ్యూల్‌లో వస్తుంది.


ఈ రియల్​మీ 12 ప్రో, ప్రో ప్లస్‌ గ్యాడ్జెట్స్​లో 6.7 ఇంచ్​ కర్వ్​డ్​ ఎడ్జ్​ అమోలెడ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్‌ డిస్​ప్లే ఉంటుంది. రియల్​మీ 12 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 32ఎంపీ టెలిఫొటో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రియర్‌ కెమెరా సెటప్‌తో వస్తుంది. 12 ప్రో ప్లస్‌ మోడల్‌లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​, 64ఎంపీ పెరిస్కోప్​ టెలిఫొటో కెమెరా రియర్‌లో వస్తుండగా.. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం రెండు మోడల్స్‌లో 16ఎంపీ, 32ఎంపీ కెమెరా సెటప్‌ ఫ్రంట్‌లో ఉంటుంది. రియల్​మీ 12 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 1, రియల్​మీ 12ప్రో ప్లస్‌లో స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 2 ప్రాసెసర్స్‌ ఉంటాయి.


ఆండ్రాయిడ్​ 14 ఆధారిత రియల్​మీ యూఐ 5.0పై పని చేయనున్నాయి. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తుంది. రియల్​మీ 12 ప్రోప్లస్‌ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ.29,999గా నిర్ణయించింది. 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ.31,999, 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.33,999గా ఉంటుంది. మొబైల్స్‌ సబ్​మెరైన్​ బ్లూ, నావిగేటర్​ కలర్స్​ అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్​కార్ట్, రియల్​మీ అఫీషియల్​ వెబ్​సైట్​​లో ఫిబ్రవరి 6న ఈ గ్యాడ్జెట్స్​ సేల్స్​ మొదలవనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్​ ట్రాన్సాక్షన్స్​పై రూ.2వేల వరకు డిస్కౌంట్‌ లభించనున్నది.