విధాత: యాదాద్రి దేవాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం వచ్చింది. ఒకే రోజులో ఇంత మొత్తంగా ఆదాయం రావడం యాదాద్రి చరిత్రలో ఇదే ప్రథమమని దేవాలయ అధికారులు తెలిపారు.
తెలంగాణ తిరుపతిగా, తెలంగాణ టెంపుల్ సిటీగా కీర్తి గడిస్తున్న పుణ్యక్షేత్రానికి ఆదివారానికి కార్తీక మాసం తోడు కావడంతో యాదాద్రికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించారు. ఈ నేపథ్యంలో అన్ని కౌంటర్త ద్వారా రూ.1,09,82,446/- ఆదాయం లభించడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి.
స్వామి వారి ఆదాయము కౌంటర్ల వారీగా..
ప్రధాన బుకింగ్ రూ.3,57,650/-
కైంకర్యములు రూ.10,532/-
సుప్రభాతం రూ.3000/-
వ్రతాలు రూ. 13,44,800/-
ప్రచార శాఖ రూ.2,16,500/-
VIP దర్శనం రూ.22,65,000/-
యాదరుషి నిలయం రూ.2,01,332/-
ప్రసాదవిక్రయం రూ.37,36,550/-
పాతగుట్ట. రూ.3,37,650/-
కళ్యాణ కట్ట రూ.1,91,700/-
శాశ్వత పూజలు రూ.42,645/-
వాహన పూజలు రూ.32,500/-
కొండపైకి వాహన ప్రవేశం రూ.10,50,000/-
సువర్ణ పుష్పార్చన రూ.2,83,160/-
వేద ఆశీర్వచనం రూ. 16,200/-
శివాలయం రూ.19,300/-
లక్ష్మి పుష్కరిణి -Nil
అన్నదానము రూ.1,78,827/-
లిజేస్ Nil
ఇతరములు Nil
బ్రేక్ దర్శనం 6,95,100/-