రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అకీరా అదే చెప్పాడు..!

  • By: sn    latest    Oct 18, 2023 12:04 PM IST
రెండో పెళ్లిపై రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అకీరా అదే చెప్పాడు..!

Badri సినిమాలో ప‌వన్ క‌ళ్యాణ్‌తో జ‌త క‌ట్టి ఆ త‌ర్వాత అత‌ని ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుంది రేణూ దేశాయ్. కొన్నాళ్ల‌పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్ద‌రు కొద్ది సంవ‌త్స‌రాల త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితంలో అకీరా, ఆద్య కూడా జ‌న్మించారు. అయితే ఏమైందో ఏమోగాని ప‌వ‌న్, రేణూ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌డం వారు విడిపోవ‌డం జ‌రిగింది.

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటూ పూణేలో ఉంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ అప్పుడ‌ప్పుడు త‌న పిల్ల‌ల‌కి సంబంధించిన విష‌యాల‌ని, అలానే త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలని షేర్ చేస్తూ ఉంటుంది.

రేణూ దేశాయ్ నుండి విడిపోయాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో  పెళ్లి చేసుకొని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చాడు. కాని రేణూ మాత్రం త‌న రెండో పెళ్లి గురించి అంత‌గా ఆలోచించ‌కుండా పిల్ల‌ల‌ని చూసుకుంటూ కొన్నాళ్ల‌పాటు అలా బ్ర‌తికేసింది. అయితే కొద్ది రోజుల త‌ర్వాత కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సలహాతో రెండవ పెళ్ళికి సిద్ధం అయింది. వ్యక్తితో నిశ్చితార్థం అయిన విష‌యాన్ని త‌న సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

అయితే అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెని బెదిరిచ‌డంతో పాటు ట్రోలింగ్‌కి కూడా దిగారు. అవ‌న్నీ రేణూ పెద్ద‌గా ప‌ట్టించు కోలేదు. కాక‌పోతే వేరే కార‌ణాల వ‌ల‌న తాను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు రేణు దేశాయ్ పేర్కొంది.

చాలా రోజుల త‌ర్వాత రేణూ దేశాయ్ వెండితెర రీ ఎంట్రీ ఇస్తుంది. ర‌వితేజ న‌టించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుండ‌గా, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రేణు దేశాయ్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రేణు దేశాయ్ తన రెండవ పెళ్లి, ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడం గురించి చెప్పుకొచ్చింది.

పవన్ నుంచి విడిపోయే సమయంలో అకిరా, ఆద్య చిన్నపిల్లలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు రెండవ పెళ్లి చేసుకోమన్నారు. కొంత కాలం త‌ర్వాత ఓకే చెప్పా. అయితే అప్పుడు ఆద్య చాలా చిన్న పిల్ల‌. అప్పుడు పెళ్లి చేసుకుంటే అతనికి సమయం కేటాయించాలి అలాగే ఆద్యకి కూడా సమయం కేటాయించాలి కాబ‌ట్టి అది క‌ష్ట‌మ‌ని అనిపించి ఎంగేజ్‌మెంట్ ర‌ద్దు చేసుకున్నాను.

నా పిల్లలు చాలా స్వీట్. నీకు ఎవరైనా వ్యక్తి నచ్చితే, అతనితో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకో అమ్మా అని అకిరా నాకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఆద్య వ‌య‌స్సు ఇప్పుడు13 ఏళ్లు కాగా, మ‌రో రెండేళ్ల త‌ర్వాత రెండో పెళ్లి విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని రేణూ పేర్కొంది.