Dirsincharla | కరెంటు సరిగ్గా ఉండడం లేదు.. రొడ్డెక్కిన దిర్శించర్ల వాసులు
Dirsincharla సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ విధాత: తమ గ్రామ విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు నేరడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామస్తులు, రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. లో వోల్టేజీ , ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలతో తరుచు విద్యుత్తు సరఫరా ఆగిపోతుందని, దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని, ఇళ్లకు విద్యుత్తు సరఫరా జరుగడం లేదంటు గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్తు ఏఈ వచ్చి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని […]

Dirsincharla
- సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ
విధాత: తమ గ్రామ విద్యుత్తు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు నేరడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామస్తులు, రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
లో వోల్టేజీ , ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలతో తరుచు విద్యుత్తు సరఫరా ఆగిపోతుందని, దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని, మోటార్లు కాలిపోతున్నాయని, ఇళ్లకు విద్యుత్తు సరఫరా జరుగడం లేదంటు గ్రామస్తులు ఆరోపించారు.
విద్యుత్తు ఏఈ వచ్చి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు రోడ్డుపై బఠాయించి ఆందోళనకు దిగారు. విద్యుత్తు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గ్రామ నాయకులతో మాట్లాడి త్వరలోనే నూతన సబ్ స్టేషన్ నిర్మాణం జరిపించి విద్యుత్తు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో శాంతించిన గ్రామస్తులు తమ ఆందోళన విరమించారు.