Rahul Gandhi | సుప్రీంలో రాహుల్‌కు ఊర‌ట‌.. రేవంత్‌, భ‌ట్టి, సీత‌క్కల హ‌ర్షం

Rahul Gandhi విధాత: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్కలు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం స్టేతో న్యాయం గెలిచిందని, బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని రేవంత్ అన్నారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమని, సుప్రీం కోర్టు తీర్పు […]

  • Publish Date - August 4, 2023 / 01:00 AM IST

Rahul Gandhi

విధాత: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్కలు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం స్టేతో న్యాయం గెలిచిందని, బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని రేవంత్ అన్నారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమని, సుప్రీం కోర్టు తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందన్నారు.

ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్లీ విశ్వాసం ఏర్పడిందని, బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచారన్నారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం సుప్రీం స్టే పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం గెలిచినట్లయిందన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర పూరితంగా కేసులు పెట్టిందన్నారు.

దేశంలో అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనేందుకు ఈ తీర్పు ఒక ఉదాహరణ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ ఎంతకైనా ప్రయత్నం చేస్తుందని భట్టి విమర్శించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతు సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం బీజేపీ కుట్ర రాజకీయాలకు చెంప పెట్టు వంటిదని, అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు.

Latest News