RGV - Ashu Reddy | వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. కాంట్రవర్సీ కామెంట్లు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. వీటిపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. శివ, క్షణక్షణం, గోవిందా గోవిందా, గాయం, సర్కార్ లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇ టీవల కాలంలో కాంట్రవర్షియల్ చిత్రాలను తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వర్మ డేంజరస్ అనే సినిమాతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నాడు. హిందీ, తెలుగు, తమిళ […]
RGV – Ashu Reddy | వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. కాంట్రవర్సీ కామెంట్లు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. వీటిపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. శివ, క్షణక్షణం, గోవిందా గోవిందా, గాయం, సర్కార్ లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇ
టీవల కాలంలో కాంట్రవర్షియల్ చిత్రాలను తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వర్మ డేంజరస్ అనే సినిమాతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నాడు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదల కానున్నది.
చిత్రంలో అప్సరా రాణి, నైనా గంగూలీ నటించారు. అయితే, రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న సమయంలో తనదైన శైలిలో వర్మ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టాడు. బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డితో ఓ ఇంటర్వ్యూ నిర్వహించాడు.
అషురెడ్డి కుర్చీలో కూర్చొని ఉండగా.. వర్మ ఆమె కాళ్ల వద్ద కూర్చొని ఉండడం అందరినీ షాక్ గురి చేసింది. అలాగే ఇంటర్వ్యూ చివరలో ‘నీ కాలుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. ముద్దు పెట్టుకొనే వర ప్రసాదం ఇవ్వు’ అంటూ అషురెడ్డిని వర్మ వేడుకున్నాడు. ‘ఇంతసేపు నా పాదాల వద్ద భక్తుడిలా కూర్చొని నన్ను దేవతల ట్రీట్ చేసిన నీ కోరిక తీర్చకుండా ఉంటానా’ అంటూ అషురెడ్డి సమాధానం ఇచ్చింది.
ఆ తర్వాత గోపాల్ వర్మ ఆమె కాలుపై ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రమోషన్ పేరుతో రాంగోపాల్ వర్మ, అషురెడ్డి చేసిన రచ్చపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా కోసం రాంగోపాల్ వర్మ మరి ఇంతకు దిగజారాలా అంటూ స్పందించారు. మరికొందరు రాంగోపాల్ వర్మను ప్రశంసించడం విశేషం.