ఆడియో లీక్.. అచ్చెన్నకు తప్పని RGV ర్యాగింగ్!

లోకేష్ యాత్రకు జనాల్లేరా చంద్రబాబు బాధ పడ్డారా విధాత‌: TDP వాళ్ళను ర్యాగింగ్ చేయడం అంటే చాలు రామ్ గోపాల్ వర్మ ఎక్కడా లేనంత హుషారుగా ఉంటారు. టిడిపి నాయకులు మాట్లాడిన ఆడియో ఏదైనా లీక్ అయిందో.. ఇక అర్జీవికి పండగే.. వాళ్ల బాధలు వాళ్ళు పడుతుంటే మధ్యలో ఈయన దూరిపోయి అది లీక్ చేసింది అచ్చెన్నాయుడే అంటూ ఈయన ఎగేస్తున్నాడు. తాజాగా లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. జీడీ నెల్లూరు కోఆర్డినేటర్ చిట్టిబాబు నాయుడుతో […]

ఆడియో లీక్.. అచ్చెన్నకు తప్పని RGV ర్యాగింగ్!
  • లోకేష్ యాత్రకు జనాల్లేరా
  • చంద్రబాబు బాధ పడ్డారా

విధాత‌: TDP వాళ్ళను ర్యాగింగ్ చేయడం అంటే చాలు రామ్ గోపాల్ వర్మ ఎక్కడా లేనంత హుషారుగా ఉంటారు. టిడిపి నాయకులు మాట్లాడిన ఆడియో ఏదైనా లీక్ అయిందో.. ఇక అర్జీవికి పండగే.. వాళ్ల బాధలు వాళ్ళు పడుతుంటే మధ్యలో ఈయన దూరిపోయి అది లీక్ చేసింది అచ్చెన్నాయుడే అంటూ ఈయన ఎగేస్తున్నాడు. తాజాగా లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. జీడీ నెల్లూరు కోఆర్డినేటర్ చిట్టిబాబు నాయుడుతో యాత్ర ఏర్పాట్లు గురించి ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్లో చేసిన సంభాషణ బయటికి లీకైంది.

మొన్న చిత్తూరులో ఇలాగే జనం లేకపోవడంతో చంద్రబాబు ఫీలయ్యారు. ఈసారి మీరు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయండి. జనాన్ని పోగు చేయండి.. లేదంటే మీమీదా చర్యలుంటాయ్ అంటూ అచ్చెన్న చేసిన హెచ్చరికలు.. ఇంకా అందులో తాము చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నది కూడా ఆడియోలో ఉంది.

సరిగ్గా ఈ పాయింట్‌ను ఆర్జీవి పట్టుకున్నారు. లోకేష్‌లో సత్తా లేదని, ఆయ‌న వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం కూడా లేదని అచ్చెన్నకు తెలుసని, ఈ ముక్క చంద్రబాబుకు తెలియజేసేందుకే ఆడియోని అచ్చన్న కావాలని లీక్ చేశాడని ఆర్జీవి సెటైర్లు వేస్తున్నారు.

ఆయన సెటైర్లు ఎలా అయినా ఉండనీ కానీ గతంలో అచ్చెన్న ఏదో చోట టిఫిన్ చేస్తూ కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ లేదు.. బొక్కా లేదు అని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.