విధాత: ఎద్దు పుండు నొప్పి కాకికి ఏమి తెలుస్తుంది లెండి. పొడుచుకు తినడమే దాని టార్గెట్.. ఇప్పుడు ఆర్జీవి కూడా అలాగే తయారయ్యాడు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ, చంద్రబాబు లోకేష్ తదితరులను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.
లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రను అవహేళన చేస్తూ తరచూ ట్విట్టర్లో పోష్టులు పెడుతున్నారు. నిన్న అచ్చెన్నాయుడిని వెక్కిరించిన ఆర్జీవి తాజాగా లోకేష్‌ను కూడా ర్యాగింగ్ చేశారు. ఇప్పటికే జనం లేక, ఊపు లేక ఏదోలా సాగుతున్న పాదయాత్ర మీద ఆర్జీవి కారం జల్లుతున్నారు.
పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన @naralokesh ఒక టెర్రిఫిక్ ఐడియా చేయచ్ఛు! చెస్ట్ నొప్పో ,లిగమెంట్ తెగిందనో చెప్పి, డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని, పాద యాత్ర ఆపేస్తే #TeluguDesam @ncbn ఆరోగ్యయానికి చాలా మంచిది. ఇది నా ఉచిత చచ్చు సలహా!
— Ram Gopal Varma (@RGVzoomin) February 9, 2023
మీకు పాదయాత్ర ఎందుకూ.. మానేయండి.. అసలు ఆ వాయిస్ రికార్డులను లీక్ చేసింది కూడా అచ్చెన్నాయుడు కావచ్చు.. అంటూ మొదలు పెట్టిన ఆర్జీవి ఇప్పుడు లోకేష్‌కు సలహాలు ఇస్తున్నారు.
మీరు ఎలాగూ యాత్ర చేయలేరు కానీ ఛాతీలో నొప్పి వచ్చిందనో.. కాలు లిగ్మెంట్ దెబ్బతిన్నదనో చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోండి. నడక ఆపేయండి..అదే మీకు మేలు అంటూ సలహాలు ఇచ్చారు.
పుండు మీద కారం చల్లుతున్నట్లు హాట్ కామెంట్లు విసురుతున్నారు. దీనికి అటు నుంచి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు సైతం గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు..