Rhinoceros | నన్ను నిమరవా.. ఫొటోగ్రాఫర్‌కు ఖడ్గమృగం అభ్యర్థన
Rhinoceros | విధాత: ఆవుకి ఉండే గంగడోలు (మెడ కింద మెత్తగా వేలాడే భాగం)ని చిన్నగా చేత్తో నిమరడం మనకూ సరదానే, ఆవుకీ సరదానే.. అడవిలో ఉండే భారీ జీవి ఖడ్గమృగానికీ అలా చేయించుకోవాలని అనిపించిందేమో.. తనను ఫొటో తీసుకోవడానికి వచ్చిన ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి తన గంగడోలుని నిమరమన్నట్లు నిలబడింది. ఆ ఫొటోగ్రాఫర్ భయపడకుండా ప్రేమగా దానిని నిమురుతూ ఉండగా.. అది చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. 2017లో జరిగిన […]

Rhinoceros |
విధాత: ఆవుకి ఉండే గంగడోలు (మెడ కింద మెత్తగా వేలాడే భాగం)ని చిన్నగా చేత్తో నిమరడం మనకూ సరదానే, ఆవుకీ సరదానే.. అడవిలో ఉండే భారీ జీవి ఖడ్గమృగానికీ అలా చేయించుకోవాలని అనిపించిందేమో.. తనను ఫొటో తీసుకోవడానికి వచ్చిన ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి తన గంగడోలుని నిమరమన్నట్లు నిలబడింది.
ఆ ఫొటోగ్రాఫర్ భయపడకుండా ప్రేమగా దానిని నిమురుతూ ఉండగా.. అది చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. 2017లో జరిగిన ఈ ఘటన వీడియోను అప్పుడే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. తాజాగా మళ్లీ ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఆగ్రహంతో తిరిగే ఖడ్గమృగం ఇలా కుక్క పిల్లలా ప్రవర్తించడం ముద్దుగా ఉందని పలువురు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
Rhinoceros | నన్ను నిమరవా.. ఫొటోగ్రాఫర్‌కు ఖడ్గమృగం అభ్యర్థన | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/tEsiS1maaW #NTR30 #Telugu #TeluguNews pic.twitter.com/rgiK1AL49T
— vidhaathanews (@vidhaathanews) May 16, 2023